హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్
ఆగస్టు 26 (జనం సాక్షి)ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహిస్తోంది. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన హాస్పిటల్స్ నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దేశ రాజధానిలో కనీసం 12 ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. హాస్పిటల్ నిర్మాణ స్కామ్ సుమారు 5,590 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2018-2019 మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 5590 కోట్లతో సుమారు 24 ఆస్పత్రుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఐసీయూ ఆస్పత్రులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. కానీ మూడేళ్ల తర్వాత కూడా పనులు పూర్తి కాలేదు.
ఇప్పటి వరకు 800 కోట్లు ఖర్చు చేసినా.. కేవలం 50 శాతం వర్క్ మాత్రమే పూర్తి అయ్యింది. ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఖర్చు 488 కోట్ల నుంచి 1135 కోట్లకు పెరిగినట్లు నివేదికలో తెలుస్తోంది. అనేక ప్రదేశాల్లో ఎటువంటి అనుమతి లేకుండానే నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల పాత్ర కూడా అనుమానాలు వస్తున్నాయి. హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2016 నుంచి పెండింగ్‌లో ఉన్నది. ఇదే కేసులో భరద్వాజ్‌తో పాటు ఆప్ నేత సత్యేంద్ర జైన్‌ను కూడా విచారిస్తున్నారు.