చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం

 

 

 

 

భీమదేవరపల్లి:ఆగస్టు 26 (జనం సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని
విశ్వనాథ కాలనీ గ్రామంలోని అల్పకుంట చెరువులో ఇటీవల జరిగిన అక్రమ దున్నకాలు గ్రామస్థుల్లో ఆగ్రహానికి దారితీశాయి. ఈ విషయాన్ని సోమవారం జనం సాక్షి పత్రికలో ప్రచురించగానే అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి చెరువుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్రమంగా దున్నకాలకు పాల్పడిన వారిని పిలిపించి కఠినంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యలు మళ్లీ కొనసాగితే చట్టపరమైన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
చెరువులను కాపాడటం ప్రభుత్వమే కాకుండా ప్రజలందరి బాధ్యత. చెరువులు నిలిచి ఉంటే భవిష్యత్ తరాలు నీటి సమస్యల నుండి తప్పించుకుంటాయి. చెరువును రక్షించడం అంటే గ్రామాన్నే రక్షించడం,అని అన్నారు.
అధికారుల ఈ వేగవంతమైన స్పందనపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.మా చెరువు రక్షణ కోసం వెంటనే చర్యలు తీసుకోవడం మాకు నమ్మకాన్ని కలిగించింది. కానీ నిరంతర పర్యవేక్షణ ఉంటేనే ఇటువంటి ఘటనలు మరలా జరగవు,అని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.