ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం

 

 

 

 

 

 

భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో సోమవారం తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు చేరుకుని నిరసన తెలిపారు.కార్యకర్తలు మొదటగా నినాదాలతో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అనంతరం మహేష్ గౌడ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ డం డం” అంటూ నినాదాలు చేశారు.సమాచారం అందుకున్న ముల్కనూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న కొందరు కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా పైడిపల్లి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అసత్య ప్రచారానికి దారి తీస్తున్నాయి. దీనికి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయాల్సి వచ్చింది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్వీరాజ్,సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, దుర్గ సింగ్,అయిత సాయి, దొంగల రాణా, ములుగు సంపత్,కంకల సదానందం,సింగం రాజేందర్,కొక్కిస వైకుంఠం,సోప్పరి నవీన్,జక్కనపెల్లి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.