నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ
ఖమ్మం, అక్టోబర్ 28 : మెస్మా, అపిట్కో ఆధ్వర్యంలో రాజీవ్ యువకిరణాలు పథకం కింద నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అపిట్కో లిమిటెడ్ కన్సల్టెంట్ ప్రశాంత్ తెలిపారు. శిక్షణ అనంతరం కేంద్రప్రభుత్వ సర్టిఫికేట్‌తో పాటు ఉపాధి కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యగల యువతీ యువకులు రేషన్‌కార్డులు, నాలుగు పాస్‌పోర్టుసైజు పోటోలు, 10వ తరగతి సర్టిఫికేట్‌తో ఈ నెల 29న సంప్రదించాలన్నారు.