నవంబర్‌లో రానున్న రామాయణ రైలు
న్యూఢిల్లీ,జూలై11(జనం సాక్షి): ఇండియన్ రైల్వేస్ ఓ ప్రత్యేక పర్యాటకుల రైలును నడపబోతున్నది. దీనిపేరు శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్. నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించే ఈ రైలు.. రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలన్నింటి గుండా ప్రయాణిస్తుంది. యూపీలోని అయోధ్యలో మొదలయ్యే ఈ ప్రయాణం తమిళనాడులోని రామేశ్వరం గుండా శ్రీలంకలోని కొలంబోలో ముగుస్తుంది. శ్రీలంక వెళ్లాలనుకునే ప్రయాణికులు.. చెన్నై నుంచి కొలంబోకు విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ రైలు నవంబర్ 14న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మొత్తం 16 రోజుల ప్రయాణం. అయోధ్యలో తొలి స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ్, శ్రీనగవేర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ విూదుగా రామేశ్వరం చేరుకుంటుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
—————