నాంపల్లి గుట్ట
మా వేములవాడకి కొండగుర్తు నాంపల్లి గుట్ట, కరీంనగర్ నుంచి వేములవాడకి వస్తున్న పెద్దవాళ్ళు పిల్లల్ని నిద్ర లేపి అప్రమత్తం చేసే స్థలం మా నాంపల్లి గుట్ట.మా చిన్నప్పుడు సెలవులు వచ్చినాయంలే కరీంనగర్ వెళ్ళే వాళ్ళం. అక్కడ మా రాధక్క వుండేది. క్లాక్‌టవర్. కరీంనగర్ రోడ్లు, భవానాలు గొప్ప వింతని కలుగచేసేవి. సెలవుల తరువాత తిరిగి మా వూరికి బయల్ద్గేేరేవాళ్లం. కరీంనగర్ నుంచి మా వూరు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కరీంనగర్ నుంచి బస్సులో ప్రయాణం చెయ్యడం కూడా ఓ వింతైన అనుభవంలాగుండేది. బస్సు ప్రతి స్టేషన్లో ఆగేది. మంకమ్మతోటలో ఆగేది. ఆ తరువాత చింతకుంట, ఆ తరువాత ఎలగందుల. ఎలగందులలో పెద్దగుట్ట. దానిచుట్టూ పెద్దకోట. కరీంనగర్ ఏర్పడకముందు ఎలగందుల రాజధానిగా వుండేదంటారు. ఎలగందుల తరువాత బావుసా యిపేట, వెంకట్రావుపల్లె, ఒద్యారం దాటితే గానీ కొదురుపాక వచ్చే దికాదు. ఆ రోడ్డువెంట అన్నీ గుట్టలే వుండేవి, కొదురుపాక దగ్గర గుట్టలు లేవు. కాని వాగుండేది. మా మూలువాగు కొదురుపాక పక్కనే వున్న శాబాష్ పల్లె మీదుగా వెళ్ళి మానేేరులో కలిసేది. ఆ వాగుమీద రెండు గజాల ఎత్తులో ఓ చిన్న రోడ్డులాంటి బ్రిడ్జి వుం ది. ఆ తరువాత గుట్ట. ఎలగందుల గుట్ట చారి త్రత్మకంగా ప్రసిద్ధి. మా నాంపల్లి గుట్ట నర్సిం హస్వామికి ప్రతీతి.నాంపల్లి గుట్టని ఆనుకొని బండ్లబాట వుండేది. ఆ దారిలో వెళితే మా వూరు మూడు కిలోమీటర్లే. కానీ కొంత దూరంమైనా ఆగ్రహారం రోడ్డు దాకా వెళ్లి కుడివైపు మలిగేది బస్సు. వాహనాలది అదే రూటు మా చిన్నతనంలో మా నాంపల్లి గుట్ట తో మాకు విడదీయరాని అనుబంధం వుండే ేది. మా వేములవాడేమో శైవక్షేత్రం. కానీ మా వూరి చుట్టు ప్రక్కల అన్నీ విష్ణు క్షేత్రాలే. మా నాంపల్లి గుట్టమీద లక్ష్మీనర్సింహస్వామివారు అంతెందుకు మా రాజేశ్వరుని గుడిలోనే అనం త పద్మనాభస్వామి, రాములవారు కొలు వుదీరి వున్నారు. మా శివుని సేవతోబాటు హరిసేవ కూడా వుంటుంది. మా గుడిలో శివ కళ్యాణం ఎంత గొప్పగా జరుగుతుందో శ్రీరాముని పెళ్లి అంతకన్నా అద్భుతంగా జరుగుతుంది. శివ రాత్రికి వూరు వూరంతా ఎట్లా కదిలి వస్తుందో శ్రీరాముని పెళ్ళికి కూడా అట్లాగే కదిలివ స్తుంది.ప్రతిసంవత్సరం శ్రావణమాసంలో నాంపల్లి గుట్టకి వెళ్ళడం, అగ్రహారంకి వెళ్ళడం మా వూరి వాళ్ళకి తప్పని సరి. మా చిన్నప్పుడు ఒకటి రెండు బస్సులు వున్నా నాంపల్లి గుట్టకి నడిచే పోయేవాళ్ళం. ఓ గుంపుగా వెళ్లేవాళ్ళం. మా వూరినుంచి బండ్లబాటలో నాంపల్లి గుట్టకి నడిచి వెళ్ళడం ఓ గొప్ప అనుభవం లా వుండేది. కథల చెప్పుకుటూ, కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం. మా దారివెంట నీటికుంటలు. కప్పల బెకబెకలు. వాటిల్లో కట్లహోట చెట్లు, సర్కార్ తుమ్మలు మా పిల్లల్ని పర్యవేక్షించడానికి పెద్దలు పులిహోరా పెరుగన్నం మోసుకురావడానికి మా మల్లయ్య
మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళడం ఒక ఎత్తు ఆ తరువాత గుట్ట ఎక్కడం మరోఎత్తు మొదటి పది నిముషాలు పరుగు పరుగున గుట్ట ఎక్కేవాళ్లు ఆ తరువాత అలసిపోయ్యేవాళ్లు నీడచాటు బండ కన్పించగానే కూర్చుండిపొయ్యే వాళ్లు సుకుమారంగా కన్పించే సూర్యుడు ప్రచండంగా మారిపోయ్యేవాడు చిన్న నీళ్ళచెంబు ఓ గుదిబండలా మారిపొయ్యేది అయినా ఎవరిలో ఉత్సాహం తగ్గేది కాదు ”నడుస్తారా! లేదా” అన్న మా మల్లయ్య మాటలకి మళ్ళీ గుట్ట ఎక్కడం మొదలుపెట్టేవాళ్ళం, మళ్ళీ కాసేపటికి ఆగిపొయ్యే వాళ్ళం మా కోసమే అన్నట్టుకొన్ని బండలు గూడులా వుండేవి వాటి కింద కాస్సేపు విశ్రమించేవాళ్ళం ఆ తరువాత మళ్ళీ నడ క.దారి వెంట బండల మీద చాలామంది పేర్లు కన్పించేవి మా పేర్లు కూడా అలా చెక్కుదామంటే మా మల్లయ్య పడనిచ్చేవాడు కాదు. తొందరపెట్టే వాడు. ఎండ బాగా ముదరకముందు గుట్ట పూర్తిగా ఎక్కాలని అనేవాడు. దాంతో మా ప్రయాణం మళ్లీ మొద లయ్యేది. మరికా స్సేపు ప్రయాణం చేసిన తరువాత మెట్లు కన్పిం చేవి. మెట్లు కన్పిం చినాయంటే గుడి దగ్గరిదాకా వచ్చినట్టు లెక్క మె ట్లేక్కి గుడి ప్రాంగ ణంలోకి వెళ్ళే వాళ్ళం.
కాళ్లుకడుక్కొని నర్సింహస్వామిని దర్శించుకునేవాళ్ళం. నర్సింహ స్వామిని చూస్తే భయంగా అన్పించేది. రాములవారేమో ప్రశాం తంగా కన్పిస్తారు. ఈ నర్సింహస్వామి ఎందుకు ఇట్లా భయపెడతా డనిపించేది. ఆ తరువాత గుడి పక్కనే వున్న గుహలోకి వెళ్లేవాళ్లం. అక్కడ నవనాటి సిద్ధుల ప్రతిమలు వుండేవి. ఆ సిద్దులే వేములవాడ గుడిని కట్టించారన్న ఓ కథ కూడా ప్రచారంలో వుంది. ఆ సిద్ధుల గుహనుంచి వేములవాడ గుడి వర కు సొరంగం వుందన్న కథనం కూడా చెప్పేవాళ్లు.ఆ రెండు దర్శ నాలు అయిపోయిన తరువాత ఓ గుహలాంటి ప్రదేశంలోకి వెళ్లే వాళ్లం. రెండు పెద్ద బండలు. ఆ రెండింటి మీద మరో పెద్దబండ. ఓ పదిమంది కూర్చునే స్థలం. ఆ స్థలం నుంచి కిందికి చూస్తే కరీంన గర్ నుంచి మా వేములవాడకి వెళ్ళే రోడ్డు కన్పించేది. దూరంగా మా అనుపురం కన్పించేది. చుట్టూ చెట్లు, వృక్షాలు, వచ్చినప్పుడల్లా పులకించిపోతాను. అన్పించేది. ఎన్ని గుట్టలని చూసినా, ఎన్ని పర్వతాలను ఎక్కినా ఎదీ నా చిన్ననాటి అనుభూతి కన్నా అద్భు తంగా అన్పించేది కాదు.మేం నాపల్లికి వచ్చినప్పుడల్లా ఆ బండల గుహ కిందే భోజనాలు చెయ్యడానికి ఇష్టపడేవాళ్ళం. ఆ ప్రదేశం ఖాళీగా లేకుంటే ఓ అరగంట వేచి చూసైనా ఆ ప్రదేశంలోనే భోజ నాలు చేసే వాళ్ళం. ఆ జాగాకోసం మా మల్లయ్యని కాపలాకి పెట్టే వాళ్ళం. మేం అక్కడ భోజనాలు చేస్తున్నంతసేపు మా వెంట వచ్చిన పెద్దవాళ్ళు మమ్మల్ని కాపలా కాసేవాళ్ళు.ఓ సారి పులిహోర తింటు న్నప్పుడు మా గుణక్క చేతినుంచి టిఫిన్ డబ్బా మూత జారి కొంతదూరంలో పడిపోయింది. మా వెంట వచ్చిన సత్యనారాయణ కిందికి దిగి ఆ మూతని తీసుకొచ్చాడు. అతను పైకి వచ్చేదాకా మా అందరి గుండెలు గబగబా కొట్టుకున్నాయి.అతను పైకి వచ్చిన తరు వాత అందరమూ ఊపిరి పీల్చుకొని చప్పట్లు కట్టాం. ఇంటికి వెళ్లిన తరువాత అతని వీరోచిత చర్యని అందరికీ పేరుపేరునా చెప్పాం. నాంపల్లి గుట్టకి వెళ్ళడం ఎంత సరదాగా వుండేదో ఇంటికి వచ్చిన తరువాత అంత కష్టంగా వుండేది. కాళ్లు నొప్పులు పెట్టేవి. విపరీ తంగా గుంజేవి. మా అక్క రిబ్బన్ తీసి కాళ్ళకి గట్టిగా కట్టుకుని పడుకునే వాణ్ణి. గుంజుతున్నాయని అంటే మరోసారి గుట్టకి పంపిం చరని అనువాళ్లం కాదు. నాంపల్లికి వెళ్ళడం ఓ విహార యాత్రలా వుండేది.
కాలేజీ చదువులకి వచ్చిన తరువాత నాంపల్లి గుట్టకి వెళ్ళడం తగ్గిపోయింది. ఉద్యోగంలో చేరిన తరువాత నాంపల్లి గుట్టకి వెళ్ళ డం మర్చిపోయాం. కొంతకాలం తరువాత పిల్లలు కొంత పెద్దవా ళ్లు అయిన తరువాత నడిచి నాంపల్లి గట్టకి వెళ్దామని ప్రతిపాదిస్తే పిల్లలెవరూ ఓటు వెయ్యాలేదు. బస్సులో వెళ్దామంటే కూడా ఇష్ట పడలేదు. అందరం కలిసి కార్లో వెళ్దామంటే – ‘ఈ పెద్దవాళ్ళతో మేం రాము. మాకు పెద్ద బోర్’ అన్నారు. ‘ఎటు వెళ్ళనివ్వరు అం తా కట్టడి చేస్తారు.’ అని కూడా అన్నారు. మేం అలా బజారుకి వెళ్ల గానే మా పెద్దన్నయ్య కొడుకుని తీసుకుని నాంపల్లి గుట్టకి వెళ్ళిపో యారు. పిల్లలతో నాంపల్లిగుట్టకి వెళ్ళడం కుదరనేలేదు. మా చిన్ననాటి స్నేహితులం కలిసి వెళ్దామంటే అది కుదరలేదు. అందరం కలిసేది ఒక్క దసరా పండగ రోజే. దానికి కూడా అందరం రావడం లేదు. వచ్చినా అందరికీ కుదరడం లేదు ఇట్లా నాంపల్లి గుట్టకి చాలా కాలంగా వెళ్లలేకపోయాను.నాంపల్లి నరసిం హున్ని దర్శించుకోనిదే మీ వేములవాడ యాత్ర పూర్తికాదు అన్న బోర్డులు కూడా మా వూర్లో వెలిశాయి. అయినా వేములవాడకి మా యాత్రలు కొనసాగుతూనే వున్నాయి.నాంపల్లి గుట్ట ప్రస్తావన వచ్చి నప్పుడల్లా ఎన్నో కొత్త విష యాలు చెప్పేవాడు మా చంద్రమౌళి. నాంపల్లి గుట్టకి వాహనాల్లో వెళ్ళడానికి వీలుగా రోడ్డు వేస్తున్నారని, వేములవాడ దేవస్థానం వాళ్లు దానికి అవసరమైన డబ్బులు మంజూరు చేశారని ఓసారి, అక్కడ పెద్ద ఆంజనేయస్వామి విగ్ర హం, కాళీయమర్ధన చేస్తున్న కృష్ణుని విగ్రహం ప్రతిష్టిస్తున్నారని మరోసారి చెప్పేవాడు. మరోసారి మా వూరు వెళ్ళినప్పుడు మరో కొత్త విషయం చెప్పాడు. మా నాంప ల్లి గుట్టమీద బిర్లా ప్లానిటోరియమ్ కూడా కడతారని, దాన్నొక టూ రిస్ట్ కేంద్రంగా తయారుచేస్తారని. మా నగుబోతు చంద్ర మౌళికి మా వూరంటే వల్లమాలిన అభిమానం. అందువల్ల అత్యాశతో అట్లా చెబుతున్నాడని అనుకునేవాణ్ణి. కానీ ఆయన బాధపడతాడని ఆ మాట ఆయనతో అనకపో య్యేవాణ్ణి. కొంతకాలానికి ఆయన మాటలు నిజాల య్యాయి. వాహనల్లో వెళ్లడానికి వీలుగా నాం పల్లి గుట్టకి రోడ్డు వేశారు. కాళీయ మర్ద నం చేస్తున్న విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. కానీ అంజనేయ విగ్రమం రాలేదు. బిర్లా ప్లా నిటో రియమూ రాలేదు. మా చంద్రమౌళి చెప్పి న అన్ని మాటలూ నిజం కాకపోయినా కొన్ని అయినా నిజం అయినందుకు సంతోష పడ్డా ను.హైదరాబాద్‌లో బిర్లామందిర్‌కి వెళ్లినట్టు, సహజసిద్ధమైన గాలిని, బండలని, బండలలో దాక్కున్న విగ్రహాలని చూడ్డానికి మా వూరి ప్రజలు ఒక్క శ్రావణ మాసంలోనే కాదు అప్పు డప్పుడూ నాంపల్లిగుట్టకి వెళ్ళవచ్చని నాకన్పిం చింది. అదే విషయం మా చంద్రమౌళితో చెప్పాను. నర్సింహస్వామిని చూడ్డానికి వెళ్ల వచ్చని ఆయన అన్నారు.ఈ మధ్య ఒకసారి కరీంనగర్ నుంచి వేములవాడకి వెళ్ళాను. లోయర్ మానేర్‌డ్యాం వల్ల ఎలగందుల వూరు పోయింది కాని గుట్ట అలాగే వుంది కొదురుపాకకి వచ్చే దారిలో కన్పించే చాలా గుట్టలు కన్పించలేదు అవి అదృశ్యం ఆ కొండలకి గుట్టలకి బాంబులు పెట్టి ధ్వంసం చేశారు. బండలుగా మార్చారు. కంకరగా మార్చి గుట్టల రూపురేఖలు లేకుం డా చేశారు. ఇప్పుడు అక్కడ గుట్టలు లేవు. వృక్షజాతి లేదు, సీతా ఫలాలు లేవు, పక్షులు లేవు. జంతుజాలం లేదు, ప్రకృతి సౌందర్య మూ లేదు. క్వారీ యంత్ర భూతాలు వున్నాయి. గుట్టల అవశేషా లున్నాయి.
మనస్సు మౌనంగా రోదించింది. ఏదో తెలియని బాధ, గుండెలో గుండుపిన్ను కదిలినట్టు, కన్నీటితో కన్ను మీద తెర. అంతా నగరీ కరణ పెద్ద కొండచిలువలా కొండల్ని, గుట్టల్ని నమిలి మింగుతున్న దృశ్యం. నా చిన్నప్పుడు నర్సింహస్వామిని చూసినదానికన్నా ఎక్కువ భయం వేసింది. బాధతో మనస్సు బరువెక్కిపోయింది. కాలం ఎన్ని మార్పులని తెస్తుంది. కాల మహిమలో ఎన్ని అదృశ్యమవుతాయి ఎన్నింటిని కోల్పోతాం ఈ గుట్టల్ని పిప్పి చెయ్యడానికి అనుమతులు వున్నాయా? అనుమతులు ఇవ్వకుండి నిరోధించగలమా? దేన్ని ఆపగలం? ఈ నగరీకరణ భూతన్ని చంపగలమా? ఆలోచనల్లో వుండగానే శాబాష్‌పల్లె దాటేశాను.నాంపల్లిగుట్ట వచ్చేసింది. అది చెక్కుచెదరలేదు అట్లాగే వుంది పైకి విళ్ళడానికి అందమైన రోడ్డు. కాళీయుడి మీద నృత్యం చేస్తున్న కృష్ణడు మా నాంపల్లి గుట్ట కొత్త హంగులతో కొత్త సొగసులతో, చెట్లతో వృక్షాలతో మెరిసిపోతుంది మా కారు వేములవాడకి వెళ్లలేదు నాంపల్లి గుట్టకి దారితీసింది. గుట్టపైకి వెళిపోయాం. కృష్ణుని దగ్గర కారు నిలిపి దర్శనం చేసుకు న్నాం. అక్కడి నుంచి బయల్దేరి మెట్లెక్కి నర్సింహస్వామి గుడికి వెళ్లాను. నర్సింహస్వామికి చేతులెత్తి దండం పెట్టానుఒకటి కాదు నాలుగు కొబ్బరి కాయలని కొట్టారు నర్సింహస్వామి రాములవారి కన్నా ప్రశాంతంగా కన్పించాడు నవనాటి సిద్దుల గుహని చూశాను మా చిన్న నాటి గుహను చూశాను అది అలాగే వుంది. అక్కడ కాసేపు కూర్చుని మా వూరికి కొండగుర్తుగా నాంపల్లి గుట్టను అటా ్టగే మిగిల్చినందుకు మరోక్కసారి నర్సింహస్వామి విగ్రహాలని ప్రతిష్టించేట్టు చూడమని మా చంద్రమౌళికి చెప్పాలనుకున్నాను.ఆ విధం గానైనా ఆ గుట్టలు మిగులుతాయన్న ఆశతో.