కేసీఆర్‌కు అస్వస్థత
` అత్యుత్తమ చికిత్స అందించండి: సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు వైద్యులు పలు పరీక్షలు చేస్తున్నారు.ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.కాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.