మిగులు జలాలివ్వండి ` చంద్రబాబు


కుప్పం(జనంసాక్షి):తెలంగాణలో గోదావరి ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ఉమ్మడి ఎపి సిఎంగా ఉండగానే దేవాదుల ఎత్తిపోతలను ప్రారంభించానని గుర్తు చేశారు. గోదావరిలో ఏటా 2వేల క్యూసెక్కులకు పైగానే వృధృాగా సముద్రంలో కలుస్తోంది. వీటిని ఎవరు వాడుకున్నా మంచిదేనని, అందుకే వృదానీటి ద్వారా బనకచర్లకు పూనుకున్నా మని అన్నారు. ఇందులో ఎవరు కూడా విమర్శలకు పోవాల్సిన అవసరం లేదన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న బాబు గురువారం విూడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రెండు రాష్టాల్రు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లని తానెప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టత ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు. వృథాగా సముద్రంలోకి పోయే వాటిలో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారు. నీటి సమస్య పరిష్కారమవుతుంది. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా.. ఎవరికీ నష్టం లేదు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను ఎప్పుడూ నేను వ్యతిరేకించలేదు. వ్యతిరేకించను కూడా అని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్ర వమిర్శలు గుప్పించారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహా లేకుండా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవిూ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడు తున్నారని మండిపడ్డారు. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను విూరు ఆదుకోకపోగా.. పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు తాత్కాలికం.. చేసిన పనులే శాశ్వతమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తానేప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మామిడి రైతులకు తాము చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసే వారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను తాము పరిష్కరిస్తామని.. రైతులకూ తమపై నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. మామిడి రైతుల గురించి.. వ్యవసాయం, హార్టీకల్చర్‌ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా, మైక్రో సబ్సిడీలిచ్చారా అని ప్రశ్నించారు. హంద్రీనీవా పనులను తామే చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే రూ.3980 కోట్లు ఖర్చు పెడుతున్నా మని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో లాభాలు వస్తాయని తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నామని అన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచించారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏ పంట వేస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. తమిళనాడులో లేని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏపీలో ఉందని ఉద్ఘాటించారు. సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమలో ఒకేసారి రూ.3,950 కోట్లు హంద్రీనీవాకు డబ్బులిచ్చాం. మైక్రో ఇరిగేషన్‌కు 90శాతం సబ్సిడీ ఇస్తున్నాం. పంటలకు ప్రాధాన్యత ఇస్తూ గిట్టుబాటు వచ్చేలా చేస్తున్నాం. రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్లాం. అయితే, వాణిజ్య పంటల్లో ఒక్కోసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నాం. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం మాది. గత ప్రభుత్వం ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇచ్చింది. ఎంత మంది పిల్లలు ఉన్నా మేము తల్లికి వందనం ఇస్తున్నాం‘ అని సీఎం తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. వ్యవసాయంలో లాభాలు పెరుగుతాయి. పంటలకు ప్రాధాన్యత ఇస్తూ గిట్టుబాటు వచ్చేలా మేం చేస్తున్నాం. రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు కూడా వెళ్లాం. ఒక్కోసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.