నాగటి నారాయణ మరణం ఉపాధ్యాయ ఉద్యమానికి తీరనిలోటు

మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి :
ఐక్య ఉపాధ్యాయ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగటి నారాయణ మరణం ఉపాధ్యాయ ఉద్యమానికి ప్రభుత్వ విద్యారంగానికి తీరనిలోటని యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి, మెతుకు సైదులు అన్నారు. సోమవారం మోత్కూరు మండల కేంద్రంలోని సంఘం ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సంతాప సభకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంకిత భావం వృత్తి నిబద్ధత సమస్యల పట్ల నిజాయితీ పోరాటం అన్ని కలగలిసిన నారాయణ నేటి తరానికి ఆదర్శనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి అక్కినేనిపల్లి వెంకటాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు విశ్రాంత ఉద్యోగుల సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి ఆకవరం వల్లభాయ్ , జిల్లా కార్యదర్శి దడిపల్లి వెంకన్న, ఆడిట్ కమిటీ కన్వీనర్ కే శ్రీనివాస్, జిల్లా సాంస్కృతి కన్వీనర్ కట్ట రమేష్, ఆత్మకూరు మోత్కూరు గుండాల అడ్డగూడూరు మండల శాఖల అధ్యక్షులు కార్యదర్శులు దర్శనం వెంకన్న, జె కరుణాకర్, ఉప్పలయ్య, డాకోజి నరేష్, దోర్నం వెంకన్న, డి సోమేశ్వర్, మొగుళ్లపల్లి సోమయ్య, జి ఆంజనేయులు, ఎం లింగమల్లు,పీ నరసయ్య, ఏ సత్తయ్య విశ్రాంత ఉపాధ్యాయులు ఎలగందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.