నాగేంద్ర నగర్ లో వైభవంగా విశ్వకర్మ యజ్ఞం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ నాగేంద్ర నగర్ లో శనివారం నాగేంద్ర నగర్ విశ్వకర్మ కార్పెంటర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అర్చకులు పోలోజు భాస్కరాచారి ఆధ్వర్యంలో యజ్ఞము పూజలు ఉదయం నుండి ఘనంగా నిర్వహించారు సుమారు 6 సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ఇక్కడ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కార్పొరేటర్ పద్మ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు నామోజు జగన్నాథ చారి, అధ్యక్షులు నమోజు కనకాచారి, ఉపాధ్యక్షులు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి రవి, చారి, ఆశం సాంబమూర్తి, రామోజీ రమేష్, కొండపర్తి వెంకటేశ్వర్లు, అడ్డూరి రాము పిడిసోజు రమేష్ చారి, మహారాజు రాజు, జనగాం రాజు తదితరులు పాల్గొన్నారు