నాడు అట్ల.. నేడు ఇట్ల..

మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాలకు, మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రతి మండల సమాఖ్య పరిధిలోకివచ్చే బ్యాంకుకు ఒక్కరి చొప్పున బ్యాంకు మిత్రను నియమించారు. బ్యాంకు మిత్రలకు మండల సమాఖ్య నిధి నుంచి గతంలో జీతాలు చెల్లించారు. మహిళ సంఘాలకు సేవ చేస్తున్న వీరికి మండల సమాఖ్య నుంచి జీతాలు ఇవ్వడం ఏమిటనీ , గ్రామైక్య సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే గత రెండేళ్లుగా మండల సమాఖ్య నుంచి ఇచ్చిన జీతాలను వీఓల వద్ద రికవరీ చేయడంతో పాటు తాజా జీతాలను కూడా వారి నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికే వీఓల నుంచి రూ. 3వేల చొప్పున రికవరీ ప్రారంభించారు. ఈ విషయమై గ్రామైక్య సంఘాలు ప్రశ్నిస్తే, నెలనెలా జీతాల చెల్లింపు వల్ల తమపై భారం పడుతోందనీ, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఏరియా కో-ఆర్డినేటర్‌ పరిధిలోకి వచ్చే సుల్తానాబాద్‌ మండలంలో ఇప్పటి వరకు 10నుంచి 12 మంది వీఓలు రూ. 3685 చొప్పున చెల్లించారు. జిల్లాలో కొన్నిచోట్ల రికవరీ కోసం ఒత్తిళ్లు తీసుకురావడంతో మహిళ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. పెద్ద వీఓలకు రూ. 3వేల చెల్లింపు పెద్ద సమస్య కాకపోయినప్పటికీ చిన్న వీఓలకు మాత్రం ఈ మొత్తం భారమే!