నాడు కరోనా….నేడు గోదావరి వరద ముంపు బాధితులకు అండగా నిలబడిన వైనం.

బూర్గంపహాడ్ జులై 18(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధి సారపాక గ్రామంలో ఐటిసి పిఎస్ పిడి పరిశ్రమ యాజమాన్యం సేవలు అమోగమని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు కరోనా సమయంలో మండల ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. నేడు గోదావరి ముంపు విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిత్యం10వేల మందికి అన్నదానంతో పాటు త్రాగు నీటి సౌకర్యాని కల్పిస్తున్నారు. సుమారు5 వేల మందికి పునరావసం కల్పించారు. వరద బాధితులను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించిన వెంటనే సానుకూలంగా స్పందించారు. ఈ విపత్కర పరిస్థితిలలో ఐటీసీ చేస్తున్న సేవలు ఎన్నటికీ మరువలేమని బాధిత కుటుంబాలు అంటున్నారు. తమ ప్రాంతంలో ఐటిసి పరిశ్రమ ఉండటం తమలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలు అదృష్టమని ఐటిసి యాజమాన్యంపై అభినందనలు తెలిపారు. అనునిత్యం ప్రజలకు అండగా నిలుస్తున్న ఐటిసి సేవలను ప్రజలు అభినందిస్తున్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా మేము ఉన్నామని ఐటిసి యాజమాన్యం ముందుకు రావడం పట్ల మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఐటిసి యాజమాన్యం నిత్యం స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కావాల్సిన సౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలను పొందుతున్నారు. ముంపు ప్రజలను తరలించే క్రమంలో రోడ్డు నిర్మాణ పనులు ఐటీసీ యాజమాన్యం దృష్టికి రాగానే వెంటనే పూర్తి చేశారు. గోదావరి వరద ముంపుకు గురైన గ్రామాల్లో ఐటిసి చేసే సేవలు అభినందనీయమని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు. సోమవారం మండల పరిధిలోని సారపాక బిపిఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముంపు వాసులకు ఐటిసి ద్వారా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ ఐటిసి పిఎస్ పిడి యాజమాన్యం కరోనా సమయంలో, నేడు ముంపు వాసులకు అండగా నిలవడం అభినందనీయమని తెలిపారు. మండల ప్రజల తరపున ఐ టి సి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు