నాణ్యమైన ఎరువుల పంపిణీ
అనంతపురం,జూలై12(జనం సాక్షి): రైతులకు మార్కెట్లో నాణ్యమైన ఎరువులు పురుగుమందులు అందించేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు వ్యవసాయశాఖ జెడి తెలిపారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలను ఈ-క్రాప్ బుకింగ్ కార్యక్రమం కూడా మరో వైపు వెలుగు, వ్యవసాయశాఖ సంయుక్తంగా చేయనున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్‌కు ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నట్లు చెప్పారు.రైతులకు పంటసాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో రాయితీ పనిముట్ల అందజేయ నున్నట్లు చెప్పారు. వేరశనగతో పాటు అంతర్ పంటల విత్తనం కింద కందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది నవధాన్యాల సాగును పెంచాలన్న ఉద్దేశ్యంతో రైతులకు కిట్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. హిందూపురం వ్యవసాయ డివిజన్ ప్రాంతంలో రైతులు సబ్సిడీ మొక్కజొన్న పంపిణీ చేయాలని కోరడంతో పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటితో పాటు సల్ఫర్,జింక్ బోరాన్ లోపం ఉన్న రైతుల పొలాలకు భూసారం పరీక్ష కార్డులు ఆధారంగా ఉచితంగా రైతులకు సూక్ష్మపోషక ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.