నాబార్డ్ వైఖరీ మారాలి – హరీశ్, ఈటెల
హైదరాబాద్ డిసెంబర్ 12 (జనంసాక్షి) : నాబార్డ్ రైతుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని మంత్రుల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఓ ¬టల్ లో జరిగిన నాబార్డు సమావేశంలో వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిపై నాబార్డ్ సదస్సు లో మాట్లాడారు.. సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… నాబార్డ్ దృక్కోణం మారాలని… రైతులకు భరోసా కల్పించాలని కోరారు. రైతు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మిషన్ కాకతీయకు రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రుణాలు ఇస్తున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సరిగా లేదని, పంటల బీమా విధానంలో మార్పు రావాలని వెల్లడించారు. వ్యవసాయ అనుంబంధ రంగాలను ప్రోత్సహించాలని కోరారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… నాబార్డు రుణ ప్రణాళిక తమకు కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ,తెలంగాణ గ్రావిూణ బ్యాంకు లోగోను రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రావిూణ బ్యాంక్ ప్రచార రథాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం జరిగిన చెరువుల మిషన్ కాకతీయ సమీక్షలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షిస్తు వచ్చే ఐదు నెలల్లో 9 వేల చెరువుల పునరుద్ధరణ జరగాలని ఆయన అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా జలసౌధలో శుక్రవారం నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీర్లు పారదర్శకంగా ఉండాలన్నారు. తప్పులుచేస్తే ఉపేక్షించబోమన్నారు. ఏ సమస్య ఉన్నా తనకు మెయిల్ ద్వారా తెలపాలని చెరువు పనుల పురోగతిపై రోజూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. మిషన్ కాకతీయ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, మిషన్ కాకతీయ మనందరికీ ఒక ఛాలెంజ్ అని మంత్రి హరీష్ ,ఇంజినీర్లతో అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా అత్యంత పారదర్శకంగా అందరం టీమ్‌గా ఏర్పడి పని చేద్దామని పిలుపునిచ్చారు.మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. పనిని పనిలాగా కాకుండా ఇష్టపడి చేయండని ఇంజినీర్లను కోరారు. నాణ్యతలో రాజీపడొద్దని ఆయన సూచించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని మంత్రి అధికారులను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మిషన్ కాకతీయలో ప్రత్యక్షంగా పాల్గొంటారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు నిధుల కొరత లేదని సరిపడే నిధులను సమకూర్చుకొన్నాకే పనులు ప్రారంభించినట్లు మంత్రి హరీష్ వెల్లడించారు.