నాలుగున్నరేళ్ల ప్రగతిని వివరిస్తాం: ఎమ్మెల్యే
సిద్దిపేట,ఆగస్ట్25(జనం సాక్షి): ప్రగతి నివేదన సభ ద్వారా ఈ నాలుగన్నరేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దిని ప్రజలకు విడమర్చి చెబుతామని, అలాగే విపక్షాల కుట్రలను తిప్పి కొడతామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. తెలంగానేర్పడ్డ తరవాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దంగా ఉన్నామని చెప్పడానికి సమాయత్తం అవుతున్నామని కూడా అన్నారు. కాంగ్రెస ఊ అంటే ఎన్నికల సవాళ్లువిసురుతోందన్నారు. దీనికి గట్టిగా సమాధానంచెప్పబోతున్నామని అన్నారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్ లోని కొంగరకలాన్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్ పార్టీ ప్రగతి నివేదన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయంగా ఎదగలేమనే భయంతో గ్రామాల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారాలను పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు. గతంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీలకు సాధ్యం కాని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని వివరించారు.