నాలుగో తరగతి ఉద్యోగి మృతికి కలెక్టర్ సంతాపం…

 దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధికారులు…
ఫోటో రైటప్: సంతాపం ప్రకటిస్తున్న అధికారులు..
వరంగల్ బ్యూరో: ఆగస్టు 29 (జనం సాక్షి)
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగినిగా పనిచేస్తున్న డి మంగమ్మ గుండె సంబంధిత వ్యాధితో చనిపోవడం చాలా బాధాకరం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, సంబంధిత అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాలుగో  తరగతి ఉద్యోగినిగా పనిచేస్తున్న. డి మంగమ్మ గుండె సంబంధిత వ్యాధితో  శనివారం  చనిపోవడం తో  జిల్లా కలెక్టర్ గోపి,అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ కోట అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ సంబంధిత కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తో కలిసి  మంగమ్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగినిగా పనిచేస్తున్న డి మంగమ్మ  గుండె సంబంధిత వ్యాధితో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు.
  ఉద్యోగులు తమ విధి నిర్వహణ తో పాటు వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలని.. ఏదైనా ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే సంబంధిత సెక్షన్ అధికారులకు తెలియజేసి సెలవు తీసుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ట్లయితే ఆరోగ్యం కుదుట పడిన తర్వాత విధులకు హాజరు కావచ్చని ఉద్యోగికి విధులు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని తన మీద తన కుటుంబ సభ్యులు అందరూ ఆధారపడతారు అని ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు,  సెక్షన్ సుపరింటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.