నాలుగో రోజు అదే హోరు

4

– ఆర్టీసీ సమ్మె కొనసాగింపు

– డిపోల్లో వంటావార్పులతో కార్మికుల నిరసన

హైదరాబాద్‌,మే9(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సమ్మె నాలుగో రోజుకు చేరడంతో శనివారం అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పుతో నిరసనలకు దిగారు. అన్ని డిపోల ముందు వంటావార్పుతో బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. మరోవైపు బస్సులు దొరక్క ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్‌ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూళ్ళు చేయడంతో ఆందోళన వ్యక్తం  చేశారు. ఇదిలావుంటే సమ్మెలో భాగంగా తిరుమలకు వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. చిత్తూరులో కార్మికులపై శుక్రవారం లాఠీచార్జికు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని కార్మికసంఘాలు ప్రకటించాయి. జగ్గయ్యపేటలో సమ్మె చేస్తున్న  ఆర్టీసీ కార్మికులపై  పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల లాఠీచార్జీతో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో నాలుగో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలువురు విపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌, సీపీఎం నేతలు సమ్మెకు మద్దతుగా

నిలిచాయి. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ ఆర్టీసీ కార్మికులకు ఇస్తే విూరేం నష్టపోతారని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మాట మార్చిందని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. విజయవాడలో జరిగిన రాజకీయ పార్టీల ఐక్యవేదిక, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బంది సాయంతో సమ్మెను విచ్ఛినం చేసేందుకు కుట్ర జరుగుతోందని రాజకీయ నేతలు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మిక సంఘాల పోరాటానికి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎస్మా ప్రయోగిస్తే ఎంతకైనా తెగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ తేల్చి చెప్పింది.    బస్సులు తిరిగితే అడ్డుకుంటామని చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తాత్కాలిక ఉద్యోగులను డిపోల్లోకి వెళ్లనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఒకరికి గుండోపోటు వచ్చింది. మరోవైపు కృష్ణా జిల్లాలో 63శాతం బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయం అని ఆర్‌ఎం తెలిపారు. అనంతపురంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం మూడో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కార్మికులను నియమించి కొన్ని బస్సులు నడుపుతుండగా, ఆర్టీసీ కార్మికులు ఆయా బస్సులపై దాడులకు దిగుతున్నారు. అనంతపురంలో కొందరు ఆందోళనకారులు రెండు బస్సు అద్దాలను పగలగొట్టారు.  ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నాలుగోరోజు కొనసాగుతోంది. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మంలో 3 బస్సుల అద్దాలను కార్మికులు ధ్వంసం చేశారు. కార్మికుల దాడిలో ఒక తాత్కాలిక బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇదిలావుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 204సిటీ బస్సులు తిరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరిధిలో 104, హైదరాబాద్‌ పరిధిలో 100 బస్సులు నడస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ అధికారులు బస్సులు నడపుతున్నారు. ఇక విధులకు హాజరైన ఒప్పంద కార్మికులకు ఆర్టీసీ నజరానా ప్రకటిచింది. ఆపత్కాలంలో సేవలు అందించినందుకు ప్రతిఫలంగా ఒప్పంద ఉద్యోగులను క్రబద్ధీకరించాలని నిర్ణయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ పక్రియ ప్రారంభమైంది. డిపోల వారిగా క్రమబద్దీకరణ చేయాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అనంతపురంలో 70, కర్నూలులో 50, గుంటూరులో నలుగురు కార్మికులను క్రమబద్దీకరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ మూడు రోజులు బస్సులు పాక్షికంగా తిరిగాయి. ఆర్టీసీ రూ.2.70 కోట్లు ఆదాయం కోల్పోయింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 250 అ/-దదె బస్సులు, 120 ఆర్టీసీ బస్సులను తిప్పారు. ఎంసెట్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపారు. వచ్చిన ఆదాయం ఇంధనానికి, డ్రైవర్లు, కండక్టర్ల జీతభత్యాలకు, అ/-దదె బస్సులు తిప్పడం వలన వచ్చిన ఆదాయం వారి అ/-దదెలకు సరిపోతోంది. శుక్రవారం ఆర్టీసీ ఆర్‌ఎం గోపినాథ్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు దగ్గరుండీ బస్సు సర్వీసులను పరిశీలించారు.