నాసా ఆరియన్‌ ప్రయోగం విజయవంతం

2
నింగిలోకి దూసుకెళ్లిన మానవరహిత వాహకనౌక

2021లో నలుగురు వ్యామోగాములు..

2030లో మనుషుల్ని అంగారకుడిపైకి పంపేందుకు నాసా యత్నం

హైదరాబాద్‌, డిసెంబర్‌5 (జనంసాక్షి) : అంగారక గ్రహంపైకి మనుషులను తీసుకెళ్లే దిశగా అమెరికా చేపట్టిన ఆరియన్‌ ప్రయోగం విజయవంతమైంది. తొలి మానవ రహిత వాహక ఆరియన్‌ ప్రయోగం సఫలీకృతమైంది. భవిష్యత్తులో అంగారకునిపైకి మానవులను పంపే దిశగా నాసా తొలి అడుగు వేసినట్లైంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7.05 గంటలకు (భారత్‌లో సుమారు రాత్రి 7.30గంటలు) ఆరియన్‌ నింగిలోకి దూసుకెళ్లి, నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఆరియన్‌లో నలుగురు వ్యోమగాములు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వేడి తాపడం, పారాస్యూట్స్‌, జెట్టీస్కానింగ్‌ పరికరాలు ఇందులో ఉన్నాయి. 2021లో నలుగురు వ్యోమగాములను అంగారక గ్రహంపైకి పంపాలని నాసా యోచిస్తోంది. 2030లో మనుషులను అంగారక గ్రహంపైకి పంపే యత్నాల్లో నాసా ఉంది.