నా ఆరోగ్యం భేష్‌: కేజ్రీవాల్‌

5
బెంగళూరు,మార్చి16(జనంసాక్షి): తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అనారోగ్యం కారణంగా 12 రోజుల పాటు బెంగళూరులో ప్రకృతి చికిత్స పొందిన కేజీవ్రాల్‌ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఆయన సోమవారం దిల్లీ చేరుకున్న అనంతరం విూడియాతో మాట్లాడుతూ దగ్గు పూర్తిగా తగ్గిందని, మదుమేహం అదుపులోకి వచ్చిందని తెలిపారు. తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నారు. ఈ 12 రోజుల్లో ప్రజా సమస్యలపై ఆలోచించడానికి సమయం లభించిందన్నారు. విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థలను మెరుగు పరిచేందుకు ఆలోచించానని కేజీవ్రాల్‌ తెలిపారు. తన ఆలోచనలను తోటి సహచరులతో పంచుకున్నానని అన్నారు.