నింగికెగసిన తెలంగాణ యోధుడు
గన్‌పార్క్ అమరవీరుల స్థూపం రూపకర్త లక్ష్మినారాయణ ఇకలేరు
సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్,మార్చి4(జనంసాక్షి): తెలంగాణ అమరవీరుస స్థూప వ్యవస్థాపకులు, హైదరాబాద్ నగర మాజీ మేయర్ లక్ష్మీనారాయణ కన్నుమూశారు. లక్ష్మీనారాయణ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరులైన వీరుల గుర్తుగా గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపాన్ని లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయడం కోసం ఆయన జైలుకు కూడా వెళ్లారు. లక్ష్మీనారాయణ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇతర మంత్రులు సంతాపం ప్రకటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా అయిన లక్ష్మినారాయణ అంత్యక్రియలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో జరిగాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.