నిందితుల నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్‌ఐ
వరంగల్: దేవరుప్పుల ఎస్‌ఐ హమీద్ నిందితుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు మాఫీ విషయమై నిందుతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.