నిజాం రాజు దూరదృష్టితో మోండా మార్కెట్
హుస్సేన్‌సాగర్‌లో మురికినీరు కలపొద్దు
వలస పాలకులు హైదరాబాద్‌ను మురికి కూపంగా మార్చారు
సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి): నిజాంరాజు దూరదృష్టితో వ్యవహరించి మోండా మార్కెట్ నిర్మించటానికి దోహదం చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మోండా మార్కెట్‌తో పాటు ఆ చుట్టు పక్కల ఉన్న పరిసరాలను సీఎం పరిశీలించారు. వ్యాపారుల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇవే తమ బతుకులు అని అక్కడి వ్యాపారులు సీఎంకు మొర పెట్టుకున్నారు. మోండా మార్కెట్‌ను అభివృద్ధి పరచాలని సీఎంకు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. మార్కెట్లను అభివృద్ది చేయాలని నిర్ణయించిన సిఎం ఈ మేరకు కేబినేట్‌లో కూడా చర్చించారు. వీటికి పక్కా భవనాలు నిర్మించి ఇస్తమాన్నారు. అలాగే రైతులకు అండగా ఉంటామని అన్నారు.
ఇక హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని మురికివాడలు, నాలాల మళ్లింపు, గృహ నిర్మాణం, పచ్చదనం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనతో పాటు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.ప్రధానంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళనచేయడం ముఖ్యమని భావిస్తున్నారు. అలాగే మురికివాడల్లో పక్కా ఇళ్ల నిర్మాణం కూడా సిఎం ప్రధాన ఎజెండాలో ఉంది. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకుంఢా దుర్భర స్థితిలో ఉన్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని ఇలాదే వదిలేస్తే భవిష్యత్ మరింత ఘోరంగా తయారవుతుందని, హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం అన్నారు. హైదరాబాద్‌కు పట్టిన జబ్బు వదలాలంటే మామూలు వైద్యం సరిపోదని శస్త్ర చికిత్స చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా హుస్సేన్ సాగర్‌ను ఈ వేసవిలో పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నగరంలో ఎన్ని రైతు బజార్లో అవసరమవుతాయో అంచనావేసి వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. నగర ప్రజలకు అవసరమయ్యేటన్ని దోబీ ఘాట్లు, బరేల్ గ్రౌండ్స్, శ్మశానవాటికలు, కూరగాయల మార్కెట్లు, టాయిలెట్లు, ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ ప్లేసులు ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
5) ప్రధాని నియోజకవర్గంలో అడ్డదిడ్డం ఆపరేషన్లు
వారణాసి,జనవరి 31(జనంసాక్షి): అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం. అక్కడే ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. వారణాసి జిల్లా చిరాయ్ పీహెచ్‌సీలో ఓ లేడీ డాక్టర్ ఇటీవల ఒకే రోజు 73 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి ఆరోగ్య కేంద్రం
ఆరుబయట ఎండలో పడుకోబెట్టింది. అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్న ఆ పీహెచ్‌సీలో రికార్డు కోసమే డాక్టర్ లలిత్ యదవ్ ఒకేరోజు ఇన్ని ఆపరేషన్లు చేశారని ఆరోపణలు
వినిపిస్తున్నాయి. చిరాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం నాలుగు బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ మందికి అత్యవసర వైద్యం చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పోనీ ముందుగానే ఎక్కువ ఆపరేషన్లు అనుకున్నా కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. అదేవిూ లేకుండా.. ఆపరేషన్ చేయించుకున్న మహిళలను ఎండలో నేలపైనే పడుకోబెట్టారట! మహిళల కుటంబ సభ్యులు, బంధువులు గొడవ చేస్తే హడావుడిగా రగ్గులు తెచ్చి కప్పారట. ఈ విషయాన్ని వారణాసి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని చెప్పారు. ఇలాగే రికార్డు కోసం గత నవంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో డాక్టర్ ఆర్కే గుప్తా
ఒకే రోజు 83 కుటంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంతో వైద్యం వికటించి 14 మంది మహిళలు మరణించిన విషయం తెలిసిందే.