నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపు

ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు
నిబంధనలకు ఓలబడే కొన్ని ఖాతాల స్తంభన
వివరణ ఇచ్చిన ట్విట్టర్‌ ప్రతినిధి
న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది. కాంగ్రెస్‌ నేతల ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేయడంపై వస్తున్న ఆరోపణలపై గురువారం
స్పందించింది. తన వేదికపై అందరికీ సమానంగా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించినవారిపై ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టడం కొనసాగిస్తామని ట్విటర్‌ అధికార ప్రతినిధి గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మా సేవలను వినియోగించుకునే ప్రతి ఒక్కరికీ నిబంధనలను వివేకవంతంగా, నిష్పాక్షికంగా అమలు చేస్తాం. మా నిబంధనలను ఉల్లంఘించే చిత్రాలను పోస్ట్‌ చేసిన వందలాది ట్వీట్లపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకున్నాం. మా విస్తృత విధానాలకు అనుగుణంగా ఈ విధంగా చర్యలు తీసుకోవడాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాం. కొన్ని రకాల ప్రైవేటు సమాచారం ఇతర సమాచారం కన్నా ఎక్కువ రిస్క్‌ను కలిగియుండవచ్చు, వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, భద్రతలను పరిరక్షించడమే ఎల్లప్పుడూ మా లక్ష్యం. ట్విటర్‌ రూల్స్‌ను అందరూ తెలుసుకోవాలి. ఏదైనా ఉల్లంఘన ఉన్నట్లు విశ్వసిస్తే, దానిని మాకు తెలియజేయండని పేర్కొన్నారు. లైంగిక దాడి కేసులో ఆరోపిత బాధితురాలి (ఓ మైనర్‌ బాలిక) తల్లిదండ్రుల వివరాలను వెల్లడిరచినట్లు నిర్దిష్టంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) తమకు తెలియజేసిందని పేర్కొన్నారు. అందుకే కొన్ని ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు. తాము ట్విటర్‌ నిబంధనలు, విధానాల ఆధారంగా సవిూక్షించామని, అదేవిధంగా భారత దేశ చట్టాల ప్రకారం వ్యక్తమైన ఆందోళనలను కూడా పరిశీలించామని తెలిపారు. హెల్ప్‌ సెంటర్‌లో వివరించినట్లుగా, ట్విటర్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఏదైనా ట్వీట్‌ ఉన్నట్లు గుర్తిస్తే, దానిని అకౌంట్‌ హోల్డర్‌ డిలీట్‌ చేసే వరకు, దానిని తాము ఓ నోటీసు వెనుక మరుగుపరుస్తామని చెప్పారు. ఆ ట్వీట్‌ను తొలగించే వరకు లేదా అపీలు విజయవంతంగా ప్రాసెస్‌ అయ్యే వరకు ఆ ఖాతాను లాక్‌ చేస్తామన్నారు

తాజావార్తలు