నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయండి.. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
బాన్సువాడ, సెప్టెంబర్ 29 (జనంసాక్షి):
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని గురువారం బాన్సువాడ బిజెపి నాయకులు కరీంనగర్ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీనీ బూత్ స్థాయిలో బలోపేతం చేసి బిజెపి నాయకులను కార్యకర్తలను సమన్వయ పరిచి కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలనీ బాన్సువాడ బిజెపి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు దొరబాబు, సంగం గంగాధర్ గౌడ్, నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు
నార్ల సురేష్ గుప్తా, అర్సపల్లి సాయిరెడ్డి, డాకయ్య, మాధవ్, ముత్యాల సాయిబాబా, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.
Attachments area