నిరంతరం కురుస్తున్న వర్షాలకు నిండిన చెరువులు
పాడైపోయిన రహదారులు కూలిన ఇండ్లు
విష జ్వరాలతో బాధపడుతున్న ప్రజలు
మోమిన్ పేట సెప్టెంబర్ 11 జనం సాక్షి
గత కొన్ని రోజుల నిరంతరం కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి మరోవైపు రైతులు వేసిన పంటలు మొత్తం మొలకెత్తిన తర్వాత పొలాల్లో నీళ్లు మొక్కలన్నీ మొరిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గ్రామాల్లో విష జ్వరాలతో బాధపడుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం ప్రైవేటు వైద్యుల దగ్గర చూయించుకోవాలంటే డబ్బులు లేకపోవడం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామాల్లో ఇండ్లు కూలిపోవడం రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. మండలంలోని మోమిన్ పేట నంది వాగు టేకులపల్లి ప్రాజెక్టు ఐమా చెరువు ప్రాజెక్టు ఎనక తల చిన్న చెరువు పెద్ద చెరువు లన్ని నిండుకుండలా దర్శనమిస్తున్నాయి ఒకవైపు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగినప్పటికీ మరోవైపు వేసిన పంటలన్నీ నష్టం కావడంతో దీనికి తోడు చేతి కందిన కూరగాయ పంటలు ఆకుకూరలు పూర్తిగా నష్టం కావడంతో కూరగాయరైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల పరిస్థితి ఒకవైపు ఆశ మరొకవైపు నిరాశ తో జీవిస్తున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లు కూలిపోవడంతో ఏ స్థాయి అధికారి ఇప్పటివరకు గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలు వినిపిస్తున్నాయి రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రస్తుత సీజన్లో మలేరియా డెంగు అతి సారా వంటి రోగాలు ప్రభలే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినప్పటికీ మండల స్థాయి గ్రామస్థాయి అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం విశేషం ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో కూలీ పోయిన ఇండ్లకు నష్టపరిహారం తో పాటు పరిసరాలు పరిశుభ్రత చేయించి రోగాలు వ్యాపించకుండా ప్రజలను కాపాడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు