నిరంతరం ప్రవహించే ఉత్తేజం చేగువేరా
ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్
జనం సాక్షి, చెన్నరావు పేట
ప్రపంచ విప్లవకారుడు చేగువేరా అని, నిరంతరం ప్రవహించే ఉత్తేజం చేగువేరా
అని ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ ఆయనను స్మరించుకున్నారు. చెన్నారావు పేట మండల కేంద్రంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో చేగువేరా 55 వ వర్ధంతి స్మరించుకున్నారు. అనంతరం జన్ను రమేష్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన వీరుడనీ,ప్రపంచ విప్లవకారుడు చేగువేరా. కాళరాత్రి అనుకుంటుంది చీకటి రాజ్యం శాశ్వతమని, చీకటి రాజ్యం లో వెలుగు నింపిన మహోన్నత వీరుడు చేగువేరా. పేద మధ్యతరగతి ప్రజలకు విముక్తి కల్పించాడనీ, ఒక డాక్టర్ గా, ఒక రచయితగా రాజకీయ నాయకుడిగా పని చేశారు.
నిత్యం చస్తూ బ్రతికేవాడు ఎడారిలోన ఇసుక రేణువు లాంటివారనీ,బ్రతుకును పోరుగా మార్చిన వాడు దేశ భవితకు ప్రాణ వాయువు చేగువేరా అన్నారు.ప్రపంచ చరిత్ర గతిలో మార్పు అనివార్యం అని నమ్మే కమ్యూనిజం భావజాలమే అదే ప్రపంచ విప్లవోద్యమ చరిత్ర అతనొక మడమతిప్పని నాయకుడనీ,నేటి యువతరానికి ఆదర్శం గా ఉన్నాడనీ.విప్లవ కెరటం లా పోరాటాలు నిర్వహించారన్నారు. ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి కల్పించారన్నారు