“నిరవధిక నిరసన దీక్షలను ప్రారంభించిన సిఐటియు మండల నాయకులు కొమరం కాంతారావు..

– గ్రామ సహాయకులు వీఆర్ఏల సమస్యలు
 పరిష్కరించాలి సి ఐ టీ యు.
కరకగూడెం,జులై  (జనంసాక్షి): రెవెన్యూ శాఖలో పని చేస్తున్న గ్రామ సహాయకుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేనియెడల ఉద్యమం తీవ్ర ఉదృతం చేస్తామని సిఐటియు మండల నాయకులు కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె నిరవధిక సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని ఏ ఒక్క రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి లేదని శాలిచాలని వేతనాలు తోటే బ్రతుకు వెళ్లదీయాల్సి వస్తుందని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతా బత్యాలు కుటుంబాన్ని పోషించడానికి కూడా సరిపోవడంలేదని వారన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరియు ప్రగతి భవన్లో చేసిన ప్రకటనకు కట్టుబడి పే-స్కేల్ జీవోను విడుదల చేసి తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి ఇతర రెవెన్యూ పనుల దగ్గర నుండి కరోనాకాలంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి అనునిత్యం వెన్నంటి ఉండి ప్రజలకు భరోసా కల్పించిన గ్రామ సహాయకులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వారన్నారు గ్రామ సహాయకులు ఆనాదిగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్నారని వారికి అర్హతల మేరకు ప్రమోషన్లు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కరోనా ఇతర ఆర్థిక పరిస్థితులు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ సమ్మె శిబిరంలో వీఆర్ఏలు సాధన పల్లి సతీష్ సాగబోయిన బాలకృష్ణ నరేష్ ఆనందరావు బుచ్చి రాములు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.