నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
172 మంది లబ్ధిదారులకు 65 లక్షల 71 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ
పటాన్చెరు సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరప్రదాయనిగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 172 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 65 లక్షల 71 వేల రూపాయల విలువైన చెక్కులను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక శాతం కార్మికులు, నిరుపేదలు జీవన ఉపాధి పొందుతున్నారని, మెరుగైన వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్నామని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే విధులతోపాటు సిఎస్ఆర్ ద్వారా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.