అనేక విప్లవాత్మక మార్పులకు ‘మహాలక్ష్మి’ కారణం
` ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించింది
` ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచింది
` పథకంపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్
హైదరాబాద్(జనంసాక్షి):ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందని పేర్కొన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల నుంచి గట్టెక్కిందని తెలిపారు. 200 కోట్ల జీరో టికెట్లతో సరికొత్త రికార్డుకు చేరుకుందని వివరించారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ యాజమాన్యానికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభినందనలు తెలిపారు.‘’ఈ ఒక్క పథకం వల్ల ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రజాపాలన ప్రారంభమయ్యే నాటికి ..ఇక ఆర్టీసీ కథ కంచికే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి జారిపోతుందనే విధంగా ఉండేది. అక్కడ నుంచి మొదలైన ప్రయాణం నేడు 200 కోట్ల జీరో టికెట్లతో ఆడబిడ్డలకు సాయం చేసింది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. (%ువశ్రీaఅస్త్రaఅa చీవషం)
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
` ఢల్లీి నుంచే కలెక్టర్లతో సిఎం రేవంత్ సవిూక్ష
న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో మాట్లాడారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. దిల్లీ నుంచే సీఎంవో అధికారులతో మాట్లాడారు. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు- ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెర్వులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొ నేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటు-లో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సవిూక్షించాలని సూచించారు.
కేటీఆర్‌కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు
` ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్టాభ్రివృద్ధికి పాటుపడాలని సూచన
హైదరాబాద్(జనంసాక్షి):బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రిసడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్టాభ్రివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈమేరకు తెలంగాణ సీఎంవో అధికారిక ’ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. అలాగే కేటీఆర్‌కు ఆయన చెల్లెలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ’అన్నయ్య.. కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇదిలావుంటే కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.