నిరుపేద కుటుంబానికి లక్ష రూపాయల ఎల్ ఓ సీ అందజేత..

(జనంసాక్షి) జులై 18 :  జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కూరేళ్ల కనకయ్య గత కొన్ని రోజుల క్రితం తాటి చెట్టుపై నుండి పడి గాయలవ్వగా ఎడమ కాలు విరుగగా హైదరాబాద్ లోని ప్రయివేటు హాస్పిటల్ లో చేరి చికిత్స పొందగా దాదాపు 5లక్షల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా కాలు ఇన్ఫెక్షన్ అవ్వడంతో కాలు తీసివేయ్యాలని వైద్యులు చెప్పడంతో ఆందోళనకు గురైన బంధువులు టీఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ ను సంప్రదించి విషయం తెలుపగా వెంటనే స్పందించిన కిరణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి కాలు తీసివేయకుండా చికిత్స చెయాలని కోరగా దాదాపు 1లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి వెంటనే లక్ష రూపాయల పత్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ పత్రాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన కె.కనకయ్య అతని కుటుంబం సీఎం కేసీఆర్ గారికి,రాష్ట్ర మంత్రి హరీష్ రావు కు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.