నిర్విన్ లో రైతులకు ఎరువుల వాడకంపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి సర్పంచ్
జనం సాక్షి,కొత్తకోట,జులై 15, కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామంలో శుక్రవారం రోజున గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ విశ్వనాధం అధ్యక్షతన వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి శిరీష గ్రామ రైతులకు పంటల గురించి వాటికి వేసే ఎరువులు ఎలా వాడాలో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందే విధానం గురించి వివరించి అవగాహన కల్పించారు.
అదేవిధంగా మిషన్ భాగిరథ నీటి వాడకం గురించి RWS AE శివనంద్ వారి టెక్నీకల్ టీంతో నల్లలుళ్ల వచ్చే భాగిరథ నీళ్లు అందరూ త్రాగాలని మనిషికి ఎలాంటి జబ్బులు రావని చెబుతూ కొన్నీ వస్తువుతో బోర్ నీళ్లకు నల్లా నీళ్లకు తేడా చూయిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ విశ్వనాధం,Aeo శిరీష, RWS Ae శివనంద్,పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వర రెడ్డి ,అంగన్వాడీ టీచర్ అరుణ, మాజీ సర్పంచ్ రాములు,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.