నిలువ నీడలేని వారికి డబుల్ బెడ్‌రూం
-వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో నిలువనీడ లేని నిరుపేదలకు రెండు బెడ్ రూంలతో కూడిన నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ కొత్త గృహనిర్మాణ పథకం ఎలా ఉండాలి, లబ్దిదారుల ఎంపిక ఎలా జరగాలి, గతంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, తదితర విషయాలపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు మహేష్‌దత్ ఎక్కా, దానకిషోర్, బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ పేదల వైద్యంపై కూడా సమీక్ష నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రిలంన్నింటీని అభివృద్ధి పరిచి పేదలకు
ప్రభుత్వ వైద్యం అందుబాటులోని తేవడమే లక్ష్యంగా పేర్కొన్నారు. గృహనిర్మాణ పథకం ఎలా ఉండాలనే విషయంపై మంత్రులు, అధికారుల నుండి ముఖ్యమంత్రి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు కట్టించే నెపంతో ఓట్ల వేట చేశాయని, ఫలితంగా గృహనిర్మాణ ఫథకం అవినీతికి మారుపేరుగా, అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. లక్షల ఇండ్లు మంజూరైనా, వేల కోట్లు ఖర్చయినా ఇంకా నిరుపేదలకు రాష్ట్రంలో నివాసాలే లేకపోవడం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానపర లోపాల పాపమని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణ జరిపితే తప్ప జరగని గ్రామమే లేదని తేలుతున్నదని అన్నారు. శాఖాపరమైన విచారణ జరిపితేనే 490 మంది గృహనిర్మాణ శాఖాధికారులు సస్పెండ్ అయ్యారని, చాలామంది జైలు పాలు కూడా అయ్యారని, అవినీతికి ఇంతకు మించిన సాక్ష్యం కూడా అవసరంలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో తప్పులు జరగకుండా, పేదలకు ఇండ్లు దక్కేలా పక్కా ప్రణాళికతో పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేతోపాటు ఇతరత్రా ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాల ప్రకారం నిరుపేదలను ఎంపిక చేసి వారికి ఇండ్లు కట్టించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఇండ్లు లేని వారందరి వివరాలు తయారు చేసుకుని దశల వారిగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ పట్టణాలలో ప్రయోగాత్మకంగా పట్టణ గృహనిర్మాణ కార్యక్రమం తీసుకున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, పూర్తి అవినీతి రహితంగా పథకం ఉంచాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. కేబినెట్‌లో కూడా ఈ విషయాన్ని చర్చిస్తామని ప్రకటించారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప లాంటి కార్యక్రమాల ద్వారా కూడా కొన్ని ఇండ్ల నిర్మాణం జరిగిందని, ఆ పథకాల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంళో కూడా అధికారులు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
వాటర్ గ్రిడ్‌పై సిఎం మరోమారు సవిూక్ష
కాకతీయపై మరోమారు సవిూక్ష చేపట్టారు. ఈ రెండు పథకాలను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి కార్యక్రమాఉల చేపట్టారు. దీంతో అధికారలుతో మరోమారు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పనులపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌గ్రిడ్ పనులకు సంబంధించి టెండర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో వాటర్‌గ్రిడ్ పనులకు టెండర్లను పిలిచే అవకాశం ఉంది.త్వరగా చెరువుల పునరుద్దరణకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇదిలావుంటే సచివాలయంలో వరంగల్ మున్సిపల్ అధికారులతో సీఎం కేసీఆర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పేరు మార్చాలని సీఎం నిర్ణయించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా పేరు మార్చాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే దీనిని గ్రేటర్‌గా మార్చాలని కూడా నిర్ణయించారు.