*నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి*

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): మునగాల మండలంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గురువారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు అయ్యారు. అదేవిధంగా మునగాల మండల కేంద్రములోని తహసిల్దార్ కు వారి కార్యాలయంలో మండల శాఖ తరపున నూతన పెన్షన్ (సిపిఎస్) విధానాన్ని పి.ఎఫ్.ఆర్.డి.ఏ చట్టాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని  వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పప్పుల వీరబాబు, మునగాల మండల శాఖ గౌరవ అధ్యక్షురాలు సాయిఈశ్వరి, మండల అధ్యక్షులు కాసాని నాగేశ్వరావు, ప్రధాన కార్యదర్శి మేకల మధుబాబు, మండల అసోసియేట్ అధ్యక్షులు పందిరి రవీందర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు సునీత, జ్యోతి, విశ్రాంత ఉపాధ్యాయులు ఓరుగంటి రవి, శ్రీకాంత్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, నాంచారయ్య, పీర్ సాహెబ్, అంబేద్కర్, వెంకట్ నారాయణ, కిరణ్, ఆజాం బాబా, జాఫర్, మండలంలోని వివిధ పాఠశాలలోని  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.