నెల గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు పంపిణీ శూన్యం. సకాలం లో పంపిణీ చేయకపోతే డి ఈ ఓ కార్యాలయం ముట్ట
సకాలం లో పంపిణీ చేయకపోతే డి ఈ ఓ కార్యాలయం ముట్టడి.
ప్రెస్ మీట్ లో ఎన్ ఎస్ యూ ఐ నాయకుల వెల్లడి
అచ్చంపేట ఆర్సీ,19జులై,(జనం సాక్షి న్యూస్):- విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందడం లేదని నియోజకవర్గంలో ని అమ్రాబాద్ మండలకేంద్రంలో ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థి సంఘం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల సమయం గడుస్తున్నా నేటికి విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని,తద్వారా విద్యార్థుల పాఠ్య అంశాల భోదనలో ఇబ్బందులు పడుతున్నారని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. తక్షణమే డి ఈ స్పందించి మూడు రోజుల వ్యవధిలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. లేనియెడల ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ తాలూకా అధ్యక్షుడు రామవత్ సంతోష్, ప్రధాన కార్యదర్శి లడ్డు యాదవ్, అమ్రాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, అచ్చంపేట ఎన్ ఎస్ యూ ఐ టౌన్ అధ్యక్షుడు సోహెబ్, నాయకులు నంది రాజు,అనిల్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.