నెహ్రూనగర్‌లో వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని సిరిసిల్ల పట్లణానికి చెందిన నెహ్రూనగర్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 నెలల క్రితమే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యను కాపురానికి పంపట్లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.