నేటి నుంచి ఎస్‌సి, ఎస్‌టి కమిటీ పర్యటన
నెల్లూరు, జూలై 29 : ఈ నెల 30, 31 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ సభ్యులు పర్యటించనున్నారు. అయిదు మంది బృందంతో కూడిన సభ్యులు 30వ తేదీన జిల్లాలో ఏదొక గ్రామాన్ని ఎంచుకుని ఎస్‌సి, ఎస్‌టిల స్థితిగతులపై అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా రెండు గ్లాసుల పద్ధతి, దేవాలయ ప్రవేశం, ప్రవేశానికి నిరాకరణ, ఇళ్ల పట్టాల పంపిణీ, భూస్వాముల ద్వారా ఎదురయ్యే సమస్యలపై వారితో సమావేశమవుతారని డిపిఆర్‌ఓ కమలాకర్‌రెడ్డి తెలిపారు. 31న స్థానిక గోల్డెన్ జూబ్లీ హాలులో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని డిపిఆర్‌ఓ చెప్పారు.