భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
` మన ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది
` రాహుల్ గాంధీ
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి మినహా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్? ఈ నిజాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. భారత్ డెడ్ ఎకానమీగా మారిపోయిందని ప్రపంచం మొత్తానికి తెలుసని, కేవలం ఒక అదానీకి సాయం చేసేందుకు భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని బీజేపీపై మండిపడ్డారు.‘‘విదేశాంగ మంత్రి పార్లమెంట్‌లో మాట్లాడుతూ మనకు అద్భుతమైన విదేశాంగ విధానం ఉందని చెప్పారు. ఒకవైపు అమెరికా దూషిస్తుంది. మరోవైపు చైనా మన వెనుక పడుతుంది. మీరు ప్రపంచ వ్యాప్తంగా అఖిలపక్ష బృందాలను పంపినా ఒక్క దేశం కూడా పాకిస్థాన్ వైఖరిని ఖండిరచలేదు. అసలు మీరు దేశాన్ని ఎలా నడిపిస్తున్నారు? పరిస్థితి మొత్తం గందరగోళంగా ఉంది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ట్రంప్?, చైనా పేరు ఎత్తలేదు. పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి భోజనం చేసి భారీ విజయాన్ని సాధించామని అంటున్నారు.’’ అని రాహుల్ మండిపడ్డారు.అంతకుముందు మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ఆర్థిక వ్యవస్థలకు డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. భారత నుంచి చేసుకునే దిగుమతులపై 25శాతం సుంకం ప్రకటించారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తాను లెక్కచేయబోనని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో వెల్లడిరచారు. ఆ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటున్నాయని ఆయన తెలిపారు. న్యూదిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామని, దానికి కారణం భారత్ అత్యధికంగా సుంకాలు విధించడమేనని ఆరోపించారు. ఈ సందర్భంగా రష్యా, అమెరికా కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్‌పైనా ఆయన విరుచుకుపడ్డారు. మెద్వదేవ్ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని హెచ్చరించారు.