ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి

బాధితుడు బొరిగెల ప్రశాంత్

ఆర్మూర్ (జనంసాక్షి) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ లోని సర్వే నంబర్ 202/3 లో ఐదు గుంటల స్థల విషయంలో సంబంధిత అధికారులు న్యాయం చేయాలని బాధితులు బోరిగేల ప్రశాంత్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మా కుటుంబానికి 202/3 సర్వే నంబర్ లో 5 గుంటల స్థలం గతంలో ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని పద్మ వినోద్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి కబ్జాకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. మా స్థలంలో ఉన్న హద్దులను చెరిపేసి భవన నిర్మాణాన విల్లాలు చేపడుతున్నారని చెప్పారు. మా స్థలం ఆక్రమణ గురించి ప్రశ్నిస్తే బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. తమ స్థలంలో భవన నిర్మాణ విల్లాలను నిర్మిస్తున్నందున నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు.చాకలి ఐలమ్మ వారసులమైన మాకు కొన్ని ఏళ్ళుగా ప్రభుత్వం అందించిన భూమి పద్మ అనే మహిళకు ఏ విధంగా వచ్చిందనేది అధికారులు అడగడం లేదని,ఆ దిశగా విచారణ జరగడంలేదన్నారు.ఐదు గుంటల స్థలం విషయంలో ఉన్నతాధికారులకు కలిసి విన్నవిస్తామని చెప్పారు.ఇప్పటికైనా అధికారులు తమ స్థలం గురించి సర్వే చేసి అప్పగించాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో కళ్యాణ్, శేఖర్, నితిన్,రుక్మిణి బాయి,లక్ష్మి,రాధ,గంగామణి,క్రాంతి పాల్గొన్నారు.