రష్యా తీరంలో భారీ భూకంపం

` ప్రకంపనల ధాటిని ఆ దేశంతో పాటు జపాన్‌నూ తాకిన సునామీ
` రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు
` భారీగా ఎగిసిపడ్డ రాకాసీ అలలు
` అత్యవసర హెచ్చరికలు జారీ
` సైరన్ల మోతతో వీధుల్లోకి వచ్చిన జనం
` ఘటనతో ప్రపంచ దేశాల అప్రమత్తం
` అమెరికాలోనూ ప్రభావం
` ప్రజలను అప్రమత్తం చేసిన ఆయా దేశాలు
` సముద్ర తీరంలో ఎగిసి పడుతున్న రాకాసి అలలు
` చైనాలోనూ వాతావరణ బీభత్సం..భారీగా వర్షాలు
` తీరానికి కొట్టుకు వచ్చిన తిమింగలాలు
` సునామీ హెచ్చరికలతో భారత్‌ అప్రమత్తం
` తక్షణమే స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌
` ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
` అమెరికా తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు
` స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ఆదేశం
` ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ట్రంప్‌
మాస్కో/టోక్యో(జనంసాక్షి):రష్యాలో భారీ భూకంపం బుధవారం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదైనది. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు- జపాన్‌కు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. 3 విూటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికాలో 2011లో సంభవించిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం అని అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని రష్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భూకంపనాలకు ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్లలోని క్యాబినెట్‌లు కూలిపోవడం, అద్దాలు విరిగిపోవడం, రోడ్లపై నిలిపిన కార్లు ఊగడం వంటి సిసి టివి ఫుటేజీలు విడుదల అయ్యాయి. భూకంపం తర్వాత కొద్ది సమయంలోనే రష్యా, జపాన్‌ తీర ప్రాంతాలను సునావిూ తాకింది. పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడ్డాయి వీటితో పాటు- ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునావిూ ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునావిూ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడ్డారురాష్ట్రం మొత్తం సునావిూ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. సునావిూ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫొటోల కోసం తీరానికి వెళ్లొద్దని చెప్పింది. ఒక్క అలతో సునావిూ రాదని, అలలు పెద్దసంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడిరచింది. ఇదిలాఉంటే.. జపాన్‌ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునావిూనే కాకుండా సైక్లోన్‌ ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలోని 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్‌ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాంతోపాటు- చుట్టు-పక్కల దేశాలపై సునావిూ అలలు విరుచుకు పడ్డాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సునావిూ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సునావిూ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యా లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునావిూ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునావిూ జపాన్‌ను కూడా తాకింది. సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్లు పడ్డాయి. జపాన్‌లోని చింబా తీరంలోని దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరోవైపు ఇప్పటికే రేడియేషన్‌ లీకేజీతో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డయీచీ అణుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇప్పటికే జపాన్‌లోని పసిఫిక్‌ తీరంలో ఉన్న కొన్ని దీవులను సునావిూ అలలు చేరుకొన్నాయి. టొకచాయ్‌ పోర్టులో 40 సెంటీవిూటర్ల అలలు రాగా.. ఎరిమో పట్టణంలో 30 సెంటీవిూటర్ల మేర అలలు వచ్చాయి. దీంతోపాటు- థోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి. హన్సంకిలో 30 సెంటీవిూటర్ల ఎత్తున అలలు వచ్చినట్లు- ఎన్‌హెచ్‌కే పేర్కొంది. ఇషినోమొకి పోర్టులో 50 సెంటీ-విూటర్ల అలలు వచ్చాయి. ఇక తీర ప్రాంతాలకు సవిూపంలో ఉన్న జపాన్‌ ఎయిర్‌ పోర్టులు కూడా సునావిూ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్‌లోని సెండాయ్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను దారి మరల్చారు.
సునావిూ హెచ్చరికలతో భారత్‌ అప్రమత్తం
రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించడంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునావిూ తాకింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.సునావిూ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎప్పటికప్పుడు సవిూక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్టాల్ల్రో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునావిూ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. విూ ఎలక్టాన్ర్రిక్‌ పరికరాలకు ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండని కాన్సులేట్‌ జనరల్‌ ’ఎక్స్‌’ ఖాతాలో వెల్లడిరచింది. మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునావిూ అలర్ట్‌ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్‌ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండని అధ్యక్షుడు సూచించారు. రష్యా తీర ప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీ లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యాలోని కురిల్‌ దీవులు, జపాన్‌ దీవులను సునావిూ తాకింది. రాకసి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు- కదిలాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, సునావిూ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు- తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.