నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

C

ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌

అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం

మంత్రులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి..సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): తెలంగాణ శాసనసభలో బ్జడెట్‌ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.ఈ సమావేశాలు మార్చి 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. అనంతరం సభ వాయిదా పడుతుంది. బిఎసి సమావేశంలో సభా కార్యక్రమాలను నిర్ణయిస్తారు. ఇక  ఈ నెల 11న బుధవారం బడ్జెట్‌  ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల సమయానికి ఇబ్బంది కలగుకుండా సమావేవాలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దం అవుతున్నాయి. వాటికి జవాబు ఇచ్చేందుకు ధీటుగా టిఆర్‌ఎస్‌ కూడా సిద్దంగా ఉంది.  బ్జడెట్‌ సమావేశాల సందర్భంగా సభలో సమన్వయంతో వ్యవహరించాలని, విపక్షాలకు దీటైన సమాధానాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులకు ఇప్పటికే సూచించారు. మంత్రిమండలి సమావేశంలో వార్షిక బ్జడెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఖరారు చేశాక అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సూచనలు చేశారు. బ్జడెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత పూర్తిస్థాయి బ్జడెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నందున మంత్రులు వీటికి సర్వసన్నద్ధంగా ఉండాలని సిఎం సూచించారు.  విపక్షాల ప్రవ్నలకు  పూర్తి స్థాయి సమాచారంతో జవాబివ్వాలని దిశానిర్దేశర చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హావిూల గురించి విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలోని ప్రధాన హావిూలన్నింటినీ నెరవేర్చామని ప్రభుత్వం భావిస్తోంది. రాష్టాన్రికి ప్రత్యేక హైకోర్టు కోసం బిజెపిని ఇరుకున పెట్టాలని టిఆర్‌ఎస్‌ చూస్తోంది.ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బిజెపి నేతలు ఇక్కడవిమర్శలు చేస్తున్నారని  మంత్రులు ఎదురుదాడి చేసే అవకాశం ఉంది.  ఆంధప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఏడున ఉదయం 8.55 గంటలకు ఉండడంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభాన్ని ఉదయం 11 గంటలకు మార్పుదల చేసినట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం ఉదయం పది గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తాయి. బిఎసిలో సమావేశాల తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆదివారం సభ ఉండాలా, కొనసాగించాలా అన్నది బిఎసిలో చర్చించనున్నారు. ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగుతాయని, సమావేశాల పెంపునకు ప్రతిపక్షాలు కోరితే బిఎసిలో నిర్ణయిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.  అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను సెన్సార్‌ లేకుండా ఇవ్వాలని విపక్షాలు కోరగా గతంలో ఏ రకంగా ఉన్నాయో వాటినే ఇప్పుడు అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు.  స్పీకర్‌ నిర్ణయం మేరకు వాయిదాల తీర్మానాల చర్చ ఉంటుందని అన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై నాలుగు రోజులు, 6 రోజులపాటు సాధారణ బడ్జెట్‌పై చర్చ 8 రోజులు పద్దులపై చర్చ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీలో వేయబోయే కమిటీలను బిఎసి సమావేశం అనంతరం ప్రకటిస్తామని స్పీకర్‌ మధుసూదనాచారి తెలిపారు. అసెంబ్లీ గేట్‌ 1 నుంచి తెలంగాణ మంత్రులు, గేట్‌ 2 నుంచి ఏపీ మంత్రులూ ప్రవేశించాలి. గేట్‌ 3 నుంచి ఇరు రాష్టాల్ర ఎమ్మెల్యేలు ప్రవేశించవచ్చు. పబ్లిక్‌ గార్డెన్‌లో ఎమ్మెల్యేలు తమ వాహనాలను పార్క్‌ చేయాలి. అసెంబ్లీ వద్ద ఇరు రాష్టాల్ర పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారు. అవసరమైతే సభ్యులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుతో సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు సభను నిర్వహించటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.  గతంలో రూల్స్‌ కమిటీ సమావేశంలో సభా సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉండాలని ప్రతిపాదించారు. అయితే… ఒకే ప్రాంగణంలో రెండు రాష్టాల్రసమావేశాలు, ఒకేసమయంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ 9.30 – 2 మధ్య జరుగుతుందని, అదే సమయంలో తెలంగాణ సమావేశాలు నిర్వహించలేమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సమావేశాల వరకు సర్దుబాటుకు సభ్యులు అంగీకరించారు. శాశ్వతంగా మాత్రం 9.30 – 1.30 మధ్య సమావేశాలు జరగాలని తెలిపారు. బడ్జెట్‌పై 6 రోజులు, డిమాండ్లపై 8 రోజులు చర్చించాలని పలువురు సభ్యులు కోరారు. అయితే, పార్లమెంటు తరహాలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. వాయిదా తీర్మానాలను ఒక పార్టీకి సంబంధించి సంఖ్యతో నిమిత్తం లేకుండా సభలో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సీపీఐ, సీపీఎం సభ్యులు కోరారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్టాల్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ – భద్రతా చర్యలపై కసరత్తు మొదలైంది. రెండు రాష్టాల్ర అసెంబ్లీ, శాసన మండళ్ల సమావేశాలు మార్చి 7వ తేదీనే మొదలుకానున్నాయి. ఏపీ మంత్రులు గేట్‌-2 గుండా అసెంబ్లీ లోనికి వచ్చి సీఎల్పీ కార్యాలయం ముందు వాహనాలు నిలుపుకొంటారు.  ఎమ్మెల్యేలు పబ్లిక్‌ గార్డెన్‌ గుండా అసెంబ్లీ గేటు నుంచి తమతమ సభలకు చేరుకుంటారు.

సమావేశాల్లో గట్టిగా వ్యవహరించనున్న కాంగ్రెస్‌

తెలంగాణ శాసనసభ బడ్జ.ఎట్‌ సమావేశాలు శనివారం నుంచి  ప్రారంభం కానుండటంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌  పార్టీ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షఉడిని మార్చడం ద్వారా కాంగ్రెస్‌ స్ట్రాంగ్‌ మెసేజ్‌ పంపడంతో ఇప్పుడు సిఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి గట్టిగా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నారు. నిజానికి జానాను కూడా మారుస్తారని అనుకున్నా అసెంబ్లీ సమావేవాల ముందు తగదని కాంగ్రెస్‌ అధిష్టానం భావించి మిన్నకుంది. జానా దూకుడుడగా వ్యవహరించకుండా టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ దశలో సమావేశాలు శనివారం ప్రారంభం కానుండడంతో కొంత కటువుగానే అధికార పక్షాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. దీంతో వివిధ సమస్యలపై ఈ సారి కాంగ్రెస్‌ సభలో ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  శాసనసనభలో కాంగ్రెస్‌ అనుసరించే వ్యూహాన్ని విపక్ష నేత జానారెడ్డి అధ్యక్షతన సిఎల్పీ సమావేశంలో చర్చించారు. గత సమావేశాల సమయంలో జానారెడ్డి తెలంగాణ ప్రభుత్వం విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరించారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సారి ఎమ్మెల్యేలు గా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కావటం..వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా మల్లు భట్టివిక్రమార్క నియమితులు కావటంతో  సభలో  జానారెడ్డి ఎలా స్పందిస్తారో  అన్నది అందరిలో ఉత్సుకత రేపుతోంది. ఇదిలావుంటే వీరిద్దరూ కొంత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుత సచివాలయాన్ని ఎర్రగడడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తరలించటాన్ని నిరసిస్తూ అంతకు ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పాదయాత్ర చేపట్టగా..ఇందులో జానారెడ్డి పాల్గొనలేదు. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు..వాస్తు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం..తెలంగాణలో జోరు అందుకుంటున్న ఇసుక మాఫియా తదితర అంశాలపై అధికార పార్టీని ప్రశ్నించేందుకు కాంగ్రెస్‌ సిద్దం అవుతోంది. గత సమావేశాల్లో మల్లు భట్టివిక్రమార్క మంచి పనితీరు కనపర్చారనే ప్రశంసలు అందుకున్నారు. ఇక పొన్నం లేవనెత్తిన జగదీశ్‌ రెడ్డి వ్యవహారం కూడా సభలో నిలదీయాలని చూస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఘాటుగానే వ్యవహరించి ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయంగా కనిపిస్తోంది.

సమస్యలపై నిలదీస్తాం : భాజపా నేత లక్ష్మణ్‌

వివిధ సమస్యలపై సర్కార్‌ను నిలదీస్తామని బిజెపిపక్ష నేత లక్ష్మణ్‌ అన్నారు. అసెంబ్లీలో సమస్యలపై బిజెపి పోరాడుతుందని అన్నారు. తెరాస ప్రభుత్వం గొప్పలకోసం తొలి బ్జడెట్‌ ప్రవేశపెట్టిందని, నిధుల ఖర్చు విషయంలో మాత్రం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఆశించిన మేర అమల్లోకి రాలేదన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి నామమాత్ర ప్రయోజనమే కలుగుతోందని, అర్హులకు పింఛన్లు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇచ్చిన హావిూలను తెరాస ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. బోధనాఫీజుల చెల్లింపుల్లో ప్రభుత్వానికి స్పష్టత లేదని, కేజీ నుంచి పీజీ విద్యపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంనుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపడతామని ఆయన పేర్కొన్నారు. సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు.