నేడు తూ.గో జిల్లాలో సీఎం పర్యటన

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ సర్పవరంలో ఐటీ పార్కు వాకలపూడిలో శిల్పారామం, సాగర్‌ సంబరాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎంతోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  చిరంజీవి, రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యాక్రమాలకు హాజరవుతున్నారు.