*నేడు మండలానికి వ్యవసాయ శాఖ మంత్రి రాక*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (28):* మండలపరిధిలోని జయన్నతిరుమలాపూర్,మున్ననూర్ గ్రామాల లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరల ను అందజేయుటకు, మరియు మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి దేవాలయన్నీ సందర్శించి, అనంతరం చాకలి పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం గోపాల్ పేట్ మండలానికి వస్తారని టీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు గాజుల కోదండం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు కావున అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మండల ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు