నేరెళ్లపై సినిమాల ప్రభావం ఎక్కువ

వారిని అనుకరించడంతో మిమిక్రీ అలవాటు

ఐక్యరాజ్యసమితలో తొలిసారి మిమిక్రీ చేసిన నేరెళ్ల

చిన్నప్పటి నుంచే సాధన చేసి దిట్టగా ఎదిగారు

వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నతనంలో చిత్తూరు నాగయ్య నటించిన భక్తపోతన చిత్రం చూసిన వేణుమాధవ్‌ ఆయనకు ఫ్యాన్‌ అయ్యాడు. ఆ సినిమా నేరెళ్లపై బలమైన ముద్ర వేసింది. అలా వేణుమాధవ్‌ తన గళంతో జిమ్మిక్కులు చేశాడు. చిన్నప్పుడు సినిమాలంటే పడిచచ్చేవాడు. కానీ మా నాయన సినిమాల కోసం డబ్బులిచ్చేవాడు కాదు. ఓరోజు నేను కాలేజ్‌లో విచారంగా కూర్చున్నాను. ఏమయ్యా విచారంగా ఉన్నావు? ఏమి ఇబ్బందులు’ అని అడిగారు మా కాలేజీ ప్రిన్సిపాల్‌ బారు వెంకటరామనర్సు. మా నాయన సినిమాలు చూడ్డానికి డబ్బులివ్వడంలేదు. ఇంగ్లీషు మూవీస్‌ మిస్సవుతున్నాను అన్నాన్నేను. అప్పుడాయన నాకు అరవై రూపాయలు (బర్సరీ) ఇచ్చారు. ఇతర లెక్చరర్లు అడ్డుపడి ‘యే బేసిస్‌ విూద ఇస్తున్నారు. అతనేవిూ బ్రిలియంట్‌ స్టూడెంట్‌ కాదు’ అన్నారు. వెంటనే ఆయన గుడ్‌ కాండక్ట్‌ కింద ఇస్తున్నాను మాట్లాడకండి అన్నారు. ఆ అరవై రూపాయలు పెట్టి 30 ఇంగ్లీష్‌ సినిమాలు తనివి తీరాచూశాను. అందులోంచి ఆర్టిస్టు గొంతులు, ముఖ్యమైన సన్నివేశాలు, బ్యాక్‌క్షిగౌండ్‌ మ్యూజిక్స్‌ నోట్స్‌తో సహా వినిపించాను. దానికి ఆయన సంతోషించారు. ‘యు విల్‌ బీ ఏ గ్రేట్‌ ఆర్టిస్ట్‌ ఇన్‌ ద వరల్డ్‌’ అని ఆశీర్వదించారు. ‘నీకే అవసరం ఉన్నా నన్నడుగు. విూ నాన్నగార్ని అడక్కు. మై ఓన్లీ సన్‌ ఈజ్‌ బీపీఆర్‌ విఠల్‌, ఐఏఎస్‌, అండ్‌ యు ఆర్‌ మై సెకండ్‌ సన్‌’ అని నాకు కొండంత ధైర్యాన్నిచ్చారు అని వేణుమాధవ్‌ తన కాలేజీ రోజుల్లోని మధురానుభవాలను వివరించారు. ఆ స్ఫూర్తితో తాను మిమిక్రీ కళను ప్రేమతో నేర్చుకున్నానని అనేవారు. భారతదేశంలో అంతకుముందు ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవం వేణుమాధవ్‌కు దక్కింది. 1971లో ఐక్యరాజ్యసమితిలో ఆయన మిమిక్రీ ప్రదర్శననిచ్చారు. ప్రపంచ దేశ ప్రతినిధులంతా ఆ ప్రదర్శనను చూసి, విని ఆయనను అపూర్వంగా సత్కరించారు. భారతీయ సమాజ స్థితిగతులను, మనుషుల హావభావాలను తన గొంతులో పలికించడమే కాదు విఖ్యాత రచయత, నటుడు షేక్స్‌పియర్‌ నాటకాల్లోని పాత్రలనూ ఆయన అలవోకగా ఆవిష్కరించాడు. ఐక్యరాజ్యసమితి డాగ్‌హమరస్కోల్డ్‌ ఆడిటోరియం అంతా మంత్రముగ్ధమైంది. 1964లో ఆస్టేల్రియాతో మొదలైన ఆయన విదేశీ ప్రయాణం ఆగలేదు. ఇప్పటికీ మూడుసార్లు ప్రపంచాన్ని చుట్టివచ్చారు. ఆయన మిమిక్రీ కళను, ప్రతిభాపాటవాల్ని పొగడని విూడియాలేదు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో గల్ఫ్‌న్యూస్‌ ఆయన గురించి విూరు ఒక సెకనుకు మించి ఈ ధ్వన్యనుకరణ చక్రవర్తికి సమయం కేటాయించకండీ. అంతకన్నా ఎక్కువసేపు విూ స్వరం ఆయన కంఠంలో ఇరుక్కుపోతే ప్రమాదం ఉంది’ అని రాసింది. అంటే ఆయన ఎంతగా ఇతరులను అనుకరసి/-తారో చెప్పడానికి ఇదో ఉదాహరణగా చెప్పుకుంటారు. ఒకసారి అమెరికాలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఒకతను వచ్చి ‘మిమిక్రీ ఎప్పుడు పుట్టింది?’ అని వేణు మాధవ్‌ గారిని అడిగాడు. వెంటనే ఆయన తడుముకోకుండా ‘విూ దేశం పుట్టనప్పుడు’ అని బదులిచ్చారు. నిజానికి మిమిక్రీ కళ నాతోనే పుట్టలేదు. కాకపోతే నేనొక సిలబస్‌ను ఇచ్చాను. మిమిక్రీ అంటే ఇలా ఉంటుందని చెప్పాను. విూరు పురాణాల్లో చూడండి ‘రామాయణంలో మాయలేడీ ‘రామా..’ అని రాముడి గొంతుని అనుకరించింది. ఇంద్రుడు కోడిని ఇమిటేట్‌ చేశాడు. భీముడు సైరంధ్రిని అనుకరించి కీచకుడిని చంపాడు. ఇలా మన పురాణాల్లోనే స్వరవంచన అనే ఒక కళ ఉంది. అరవైనాలుగు కళల్లో అదొకటి. కాకపోతే నేను కొంచెం ప్రాచుర్యం కల్పించాను. అనేక మార్పులు తీసుకొచ్చానని వేణుమాధవ్‌ తన అనుభవాలను చెప్పేవారు. ఇమిటేట్‌ చేసే అలవాటు నాకు చిన్నతనం నుంచే అలవాటైంది. ఇంట్లో బంధువులు అంతా కూర్చున్నప్పుడు వాళ్ల గొంతులు వాళ్లకే వినిపించేవాడిని. వాళ్ళెట్లా మాట్లాడితే అట్లానే మాట్లాడేది. బజారులో ఉండే వాతావరణాన్ని ఇంట్లో వినిపించేవాడిని. అలా అది మిమిక్రీ అని తెలియకుండానే అదే ప్రపంచంగా బతికాను. దాన్నే నేను సర్వస్వంగా భావిస్తాను ఇప్పటికీ. నేను చాలామంది నటుల్ని, పండితుల్ని, పామరుల్ని అందరినీ అడిగాను. కానీ మిమిక్రీ అంటే ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేదు. మిమిక్రీ ఒక శాస్త్రం. ఒక కళను శాస్త్రబద్ధంగా రాస్తే అది భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతుంది. అప్పుడు మొదలుపెట్టాను మిమిక్రీ శాస్త్రబద్ధం చేయాలనే ప్రయత్నాన్ని. అది సఫలం అయిందని అంటారు. తాను రాసిన పుస్తకాన్ని చదివి కేవీ రమణాచారి దీన్ని తెలుగు యూనివర్సిటీలో ఒక కోర్సుగా ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అందుకు ప్రయత్నం చేద్దామని పట్టుబట్టారు. అసలు ఆయన కృషి, పట్టుదల వల్లనే 11 ఏళ్లుగా మిమిక్రీ ఒక కోర్సుగా కొనసాగుతోంది. రెండేళ్లు నేను చెప్పాను. ఆ తరువాత నా శిష్యులు చెప్పారు. ఇప్పుడు ఆంథోనిరాజ్‌ చెబుతున్నాడు. ఆయన దీనిపై పీహెచ్‌డీ కూడా చేస్తున్నాడు. ఒక కళాకారుడికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండని వేణుమాధవ్‌ గర్వంగా చెప్పేవారు. ఈ కళద్వారానేను ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చాను. ఈ ప్రపంచం నన్ను గుర్తించింది. ఒక కళాకారుడిగా నేను సంపాదించిన దాంట్లో కొంతభాగం కళాకారులకు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ పెట్టాం. దీని ద్వారా యేటా ఒక కళాకారుడికి అవార్డు ఇస్తున్నాం. పెయింటర్‌ విశ్వనాథం గారి నుంచి మొదలుకొని జానీలివర్‌ ఇలా ఎంతోమందికి అవార్డులిచ్చాం. ఈసారి ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్యకు ఆ అవార్డు ఇస్తున్నాం’ అంటూ తన కళారంగ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు వేణుమాధవ్‌. నేరేళ్ల వేణుమాధవ్‌ను ఓ స్కూల్‌ టీచర్‌గా కంటే మిమిక్రీ మ్యాస్టోగ్రానే ఎక్కువగా భావిస్తారు. ఐక్యరాజ్యసమితిలో కార్యక్షికమం నిర్వహించి, ప్రపంచదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన తరువాత వేణుమాధవ్‌ను అప్పటి ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసింది. ఆ పదవిలో ఆయన 1972-1978 దాకా కొనసాగారు. నేరేళ్ల వేణుమాధవ్‌ కళా సేవకు ప్రపంచమే అబ్బురపడింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. కాకతీయ, ఆంధ్రా, జేఎన్‌టీయూలు ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను బహుకరించాయి. కనకాభిషేకాలు, గండపెండేరాలు, ఉగాది పురస్కారాలు, కళావూపపూర్ణ బిరుదులు ఒకటా రెండా ఎన్నో ఆందుకున్నారు. నేను ఆయనకు రెండో భార్యను అంటూ, మొదటి భార్య మిమిక్రీ అని భార్యనేరెళ్ల శోభావతి వేణుమాధవ్‌ చెప్పేవారు. .వంకపెట్టడానికి ఆయనలో ఏవిూలేదు. మంచిగుణాలు పోతపోసిన విగ్రహం. చీమకు కూడా హానితలపెట్టరు. ఎవరిని నొప్పించరు. తన శిష్యులంతా ఉన్నతిలోకి రావాలని కోరుకుంటారు. చిన్నవారైనా పెద్దవారైనా అందరినీ ఆయన ‘గారు’ అనే సంబోధిస్తారని చెప్పేవారు.