పంటరుణాలను వేగవంతం చేయాలి

గుంటూరు, జూలై 28 : జిల్లాలో ఖరీఫ్‌లో పంటరుణాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ ఆదేశించారు. గుంటూరు గీత రీజెన్సీ హోటల్‌లో శనివారం జరిగిన గోదావరి గ్రామీణ బ్యాంక్‌ పాలక వర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమావేశానికి ఛైర్మన్‌ ఎం.గోపాలక్రిష్ణ అధ్యక్షత వహించారు. కలెక్టర్‌ సురేష్‌ కుమారి మాట్లాడుతూ, జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. పత్తి ఐదు లక్షల ఎకరాల్లో సాగుచేశారు. రైతులు ముమ్మరంగా వరి, మిర్చినారు పోస్తున్నారన్నారు. ఈ దశలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఇతర అంతరీసేద్యానికి కావాల్సినంత పెట్టుబడులు కావాల్సి ఉంటుందన్నారు. వీటిని దృష్టిలో వుంచుకొని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా అమలు చేయాలన్నారు. జిల్లాలో అర్హత పొందిన గుర్తింపు కార్డులు ఉన్న కీలు రైతులకు కూడా సీజీబీజీ కీలు రైతులు ఎక్కువగా రుణాలు పొందినట్లు చెప్పారు. ఆంధ్రబ్యాంక్‌ డీజీఎంలు కె. వెంకటేశ్వర్లు, నాబార్డు ఏజీఎం నాగేశ్వరరావు. సాంబిరెడ్డి పాలకవర్గ సభ్యులు తదితరులు ప్రసంగించారు. కలెక్టర్‌ పాలక వర్గసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.