పంటల బీమా పథకాన్ని అమలుకు నికరమైన చర్యలు,తీసుకోవాలి.
సిపిఐ రైతు సంఘం డిమాండ్…
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.పంటల బీమా పథకం అమలుకు నికరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నేరేడుచర్ల మండల అధ్యక్షుడు కత్తి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
గురువారం నాడు నేరేడుచర్ల మండలంలోని బోడల దిన్న గ్రామంలో రైతు సంఘం డిమాండ్స్ డే సందర్భంగా రైతు పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నిర్ణయించిన మేరకు పంటకు మద్దతు ధర ఇవ్వాలని,ఆ మద్దతు ధరకు గ్యారెంటీ చట్టం చేయాలని, విద్యుత్ సవరణ చట్టం జీవో నెంబర్ 22 రద్దు చేయాలని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని.ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు నల్ల చట్టాల రద్దు కోసం జరిగిన అసమాన పోరాటంలో అమరులైన 750 మంది రైతులకు నష్టపరిహారం అందించాలని ఆ రైతాంగం పేరిట వారికి స్మారక చిహ్నం నిర్మించాలని ఉద్యమకారులకు పై పెట్టిన 80000 కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రైతు సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి ఎల్ల బోయిన సింహాద్రి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, అఖిల భారత యువజన సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను,అయిల నాగేశ్వరరావు, కటికోల వెంకన్న,అంజయ్య, శ్రీనివాసరెడ్డి,కొత్తపల్లి రామయ్య, కౌసల్య,వినోద్ తదితరులు పాల్గొన్నారు