పక్కా భవనాల నిర్మాణం కోసం పంచాయితీల చూపు

చిత్తూరు,జూన్‌15(జ‌నంసాక్షి):  పంచాయతీకు పక్కా భవనాలు సమస్యగా మారాయి. జిల్లాలో పలు పంచాయితీలకు భవనాలు లేవు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యకలాపాలను ఎంపీడీవో కార్యాలయం నుంచే సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ కార్యాలయాలకు భవనాలే లేవు. భవన వసతి లేని కారణంగా పంచాయతీ కార్యర్శులు చుట్టపుచూపుగా గ్రామాలకు వచ్చి వెళ్తున్నారు.  ఫలితంగా గ్రవిూణులు చిన్న సమస్యలకు కూడా..మండల కేంద్రానికి రావాల్సిన పరి/-థసితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి..పంచాయతీ కార్యాలయాలకు భవనాలు అందుబాటులోకి తేవాలని, కార్యదర్శులు గ్రావిూణులకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కొన్నిచోట్ల పంచాయతీ భవననిర్మాణం పునాదులకే పరిమితమైంది. పాలన వ్యవహరాలు చక్కదిద్దాలంటే ముందుగా కార్యాలయాలు ఉండాలి. సర్పంచి, కార్యదర్శులు, సిబ్బంది కూర్చునేందుకు తగిన వసతులు కల్పించాలి. ఇవేవిూ లేకపోవడంతో పలు మండలాల్లో పంచాయతీల పాలన అటకెక్కింది. కొన్ని గ్రామాల్లో నూతన భవన నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. గతంలో పంచాయతీ భవనాల మరమ్మతులు బీఆర్‌జీఎఫ్‌ నిధులతో చేపట్టే వారు. . ప్రస్తుతం బీఆర్‌జీఎఫ్‌ నిధులు రద్దు చేశారు. మరమ్మతు చేయాల్సిన పంచాయతీ కార్యాలయాలు, పంచాయతీ భవనాలు లేని, అసంపూర్తిగా ఆగిన భవనాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. వీటికి  నిధులు మంజూరైతే పనులు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

తాజావార్తలు