పత్తి చేను ధ్వంసం చేసిన కోతులు
కోతుల బెడద నుండి కాపాడాలని రైతు వేడుకోలు
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 11 : చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో అమరగొండ నర్సింహులు అనే రైతుకు చెందిన పత్తి చేనులో కోతులు గుంపులు గుంపులుగా వచ్చి మొక్కలు, కాయలను ధ్వంసం చేశాయి. కోతుల బెడద కారణంగా చేతికొచ్చిన పంట నేల పాలవుతుందని రైతు వాపోయారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కోతులను పట్టుకొని కోతుల బెడద నుండి రైతులను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.