పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజ

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 20:: ప్రభుత్వ పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ఆదర్శంగా ముందుగా  ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 57 మంది లబ్ధి దారులకు మనోహరబాద్ లోని రైతు వేదికలో  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఫారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తో కలిసి కళ్యాణ లక్ష్మీ, షాది ముబరక్ చెక్కులను అందజేశారు. జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం, కెసిఆర్ కిట్, ఆడపిల్ల పుడితే 13000 లు ఇచ్చి గౌరవంగా ఇంటి దగ్గర ప్రభుత్వ వాహనంలో దించి వస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజల కోసం సంక్షేమ పథకాలను చేపట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి ఎంపిపి. పురం నవనీత, వైస్ ఎంపీపీ. విఠల్ రెడ్డి, ఎంపీటీసీ లత వెంకట్, గౌడ్ టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, వివిధ గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area