పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి….

డిఇఓ సిరాజుద్దీన్
 గద్వాల రూరల్ జులై 20 (జనంసాక్షి):-  పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి  ప్రణాళికతో 100% ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి  సిరాజుద్దీన్ అన్నారు. తనిఖీలో భాగంగా ధరూర్ మండలం రేవులపల్లి జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలను సందర్శించి 10వ తరగతి విధ్యార్థులతో వారు నేర్చుకున్న అంశాలు మరియ ఉపాధ్యాయుల బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మంచి భవిష్యత్తుకు ప్రణాళిక ఎలా  వేసుకోవాలో వివరిస్తూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ప్రయోగాత్మకంగా బోధిస్తున్న ఉపాధ్యాయులు అరవింద్ ను ప్రత్యేకంగా అభినందించారు. భూమిక అమలు తీరు, ఉపాధ్యాయుల టీచింగ్ నోట్స్, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల  హాజరు, ఉపాధ్యాయ సమావేశాల నిర్వహణా తీరు, పాఠ్య పుస్తకాల పంపిణీ మరియు పాఠశాల రికార్డ్ లను తనిఖీ చేశారు.పదవ తరగతి లో 9.3 మరియు 9.2 సాధించి పాఠశాలలో మొదటి , రెండవ స్థానంలో నిలిచిన వైష్ణవి, కీర్తి లను శాలువాలతో సత్కరించి అభినందించారు. హెచ్ఎం నరేష్ మరియు ఉపాధ్యాయులందరు డిఇఓ ని సన్మానించారు. ఉపాధ్యాయులు  విష్ణు, తిమ్మారెడ్డి, మల్లప్ప, అరవింద్,రజనీకాంత్, గజేంద్ర, సుజాత, గోపీనాథ్ లు పాల్గొన్నారు.
Attachments area