పది మంది టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు

C

జాతీయ గీతాన్ని అవమాన పరిచారు

సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌

భాజపా వాకౌట్‌

హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు సస్పెన్షన్లతో మొదలయ్యాయి. శనివారం అసెంబ్లీ సమావేశాలు  గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమయ్యే సందర్బంలో జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో కొందరు గొడవ చేశారు. దీనిపై సోమవారం వీడియో ఫుటేజి చూసిన సభ్యులు ఇందుకు కారకులైన వారిని క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు. దీనిపై సభలో టిడిపి సభ్యులు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. దీంతో సభనుంచి డీపీ సభ్యులను సస్పెండ్‌ చేసారు. ఇందులో అధికార పక్షసభ్యులు ఉన్నా చర్య తీసుకోవాలని విపక్షనేత జానారెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ కుమార్‌ సభకు క్షమాపణ చెప్పారు. అయితే కేవలం విపక్షాలనే టార్గెట్‌ చేశారని ఆరోపిస్తే బిజెపి వాకౌట్‌ చేసింది.  సభ ప్రారంభమైన వెంటనే శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమాన పరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలని సూచించారు.గౌరవ సభ్యులు క్షమాపణ చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య మినహా మిగతా టీడీపీ సభ్యులంతా సస్పెండ్‌ అయ్యారు. సోమవారం ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. జాతీయ గీతాన్ని అవమానపరచినందుకు క్షమాపఫణలు చెప్పాలని సభా వ్యవహరాల మంత్రి హరీష్‌ రావు తీర్మానించారు. దీనికి నిరాకరించడమే గాకుండా, ఇతర అంశాన్ని తీసుకుని  ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులను బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు సభలో ప్రతిపాదించారు. దీనికి స్పీకర్‌ అనుమతించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, అరికిపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, కృష్ణారావు, ప్రకాష్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య, వివేకానంద, సాయన్న సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు. విపక్షాల నిరసనలు, నినాదాలతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణలో మాలలు, మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే  అంతకు ముందు హరీష్‌ రావు మాట్లాడుతూ జాతీయ గీతాన్ని అవమానించిన టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  క్షమాపణ చెప్పకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన…స్పీకర్‌ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. సభను అడ్డుకునేందుకే టీడీపీ సభ్యులు యత్నిస్తున్నారని హరీష్‌ రావు అన్నారు.  సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్‌ …ఆందోళన చేస్తున్న సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.  దాంతో హరీష్‌ రావు ఆందోళన చేస్తున్న సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ఫైర్‌  అయ్యారు. జాతీయగీతాన్ని అవమానించిన టీడీపీ ఎమ్మెల్యేలు సభకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోరారు. ఇది జాతికి అవమనామన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడడం అవమానకరమన్నారు. ఇందుకు స్పీకర్‌ టీడీపీ సభ్యులకు మూడు సార్లు మైక్‌ ఇచ్చిన క్షమాపణ చెప్పకుండా గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సభ జరగడం ఇష్టం లేదన్నారు. ఆటంకం కలిగించేందుకు మాత్రమే వారు సభకు వచ్చారని పేర్కొన్నారు. మూడు సార్లు మైక్‌ ఇచ్చినా వారు సభకు క్షమాపణ చెప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  తెదేపా సభ్యులను బ్జడెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు.  కాగా అంతకు ముందు జాతీయ గీతాన్ని అవమానపరిచిన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు.  అయితే వారు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించటంతో పాటు సభలో ఆందోళన కొనసాగిస్తుండటంతో టీడీపీ సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్‌ చేయాలని హరీష్‌ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని స్పీకర్‌ ఆమోదించారు. అయితే సభ నుంచి సస్పెండ్‌ అయినా కూడా టీడీపీ సభ్యులు మాత్రం స్పీకర్‌ పోడియం వద్ద తమ నిరసన కొనసాగించడంతో వారిని మార్షల్స్‌ బయటకు పంపారు.

భాజపా వాకౌట్‌

వెల్‌లోకి వచ్చిన టిడిపి సభ్యులను బ్జడెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయడం సరికాదని తెలంగాణ శాసనసభలో భాజపా పక్షనేత లక్ష్మణ్‌ అన్నారు. శాసనసభలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ… తెదేపా సభ్యుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కోరారు. ఇది కేవలం విపక్షంపై చర్య తీసుకునేదిగా ఉందని ఆయన మండిపడ్డారు.  జాతీయగీతాన్ని అవమానించటం సరికాదని భాజపా శాసనసభాపక్షనేత లక్ష్మణ్‌ అన్నారు.  జాతీయగీతాన్ని అవమానించిన సభ్యులు క్షమాపణ చెప్పాలని సూచించారు. తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయడం సమంజసం కాదని, పునఃపరిశీలించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై ఆరూరి రమేశ్‌ ధన్యవాద చర్చ చేపడతుతున్న దశలో లక్ష్మణ్‌ మరోమారు ఈ అంశపై మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యలుపై చర్య ఎందుకు తీసుకోలేదన్నారు. కావాలనే విపక్షసభ్యలుపై చర్య తీసుకున్నారని అన్నారు. శాసనసభలో పక్షపాత ధోరణి చూపిస్తున్నారని.. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ సభలో పేర్కొన్నారు. అందుకు నిరసనగా వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… క్షమాపణ చెప్పేందుకు స్పీకర్‌ పలుమార్లు అవకాశం ఇచ్చినా … పట్టించకోకుండా మళ్లీ ఆందోళనకు దిగడంతోనే టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందని వివరించారు.